Smriti Irani: 'కేంద్రం క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది'

Union Minister Smriti Irani Lauds Government India Success At Olympics - Sakshi

కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందని..ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలను నెలకొల్పినట్లు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ప్రధాని మోడీ ఖేలో ఇండియా కేంద్రాలు తీసుకొచ్చారని మీడియా సమావేశంలో వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎంతో మంది క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని ప్రతిభను చాటుతున్నారని వివరించారు. ఒలింపిక్స్ లో పోటీ చేసిన ఇండియా.. గోల్డ్ మెడల్ సాధించిందని, అలాగే పారాలింపిక్స్ లో కూడా క్రీడాకారులు 19 పతకాలు సాధించి దేశ కీర్తిని ఇనుమడింప చేశారని స్మృతి ఇరానీ సంతోషం వ్యక్తం చేశారు. మహిళల హాకీ జట్టు మరోసారి అవార్డులను ఎలా తెచ్చిపెట్టిందో దేశం చూసిందన్నారు. 

కేంద్రం ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ ను లక్ష్యంగా పెట్టుకుని సాధన చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా అగ్రశ్రేణి భారతీయ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చేందుకు వీలు కల్పించిందన్నారు. శిక్షణా కార్యకలాపాల నిమిత్తం ఒక్కో క్రీడాకారుడికి ఏడాదికి రూ.5 లక్షలు అందజేస్తుందని మంత్రి స్మృతి ఇరానీ వివరించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top