Breadcrumb
Live Updates
సెమీస్‌లో ఆసీస్‌ను ఢీకొట్టనున్న యువ భారత్
అండర్-19 వరల్డ్‌కప్: ఫైనల్లో టీమిండియా
అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత యువ బౌలర్లలో విక్టీ ఓస్టావల్ మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీయగా, నిషాంత్ సింధు, రవి కుమార్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్ తాంబే, రఘువంశీలు చెరో వికెట్ తీశారు.
ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన యువ భారత్
కెప్టెన్ యష్ ధుల్(110), వైస్ కెప్టెన్ షేక్ రషీద్(94)లు చెలరేగి ఆడటంతో ఆసీస్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి ప్రత్యర్ధికి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆఖరి ఓవర్లో దినేశ్ బనా(20), నిషాంత్ సింధు(12) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.
వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన యువ భారత్
ఇన్నింగ్స్ 46వ ఓవర్లో యువ భారత్‌కు వరుస షాక్‌లు తగిలాయి. సెంచరీ తర్వాత గేర్ మార్చిన కెప్టెన్ యష్ ధుల్(110 బంతుల్లో 110; 10 ఫోర్లు) తొలుత రనౌట్ కాగా, ఆ మరుసటి బంతికే షేక్ రషీద్(108 బంతుల్లో 94; 8 ఫోర్లు, సిక్స్) క్యాచ్ ఔటయ్యాడు. సెంచరీ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్న రషీద్.. నిరాశగా వెనుదిరిగాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరు వరుస బంతుల్లో ఔట్ కావడంతో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. 46 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 241/4గా ఉంది.
శభాష్ ధుల్..సెంచరీతో చెలరేగిన యువ భారత కెప్టెన్‌పై ప్రశంసలు
Captain's knock 🔥#INDvAUS | #U19CWC pic.twitter.com/HB2o6kbcY0
— Cricket World Cup (@cricketworldcup) February 2, 2022
శతక్కొట్టిన యువ భారత్ కెప్టెన్
యువ భారత కెప్టెన్ యష్ ధుల్ సెంచరీతో కదంతొక్కాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వరుస బౌండరీలు బాది సెంచరీ మార్కును చేరుకున్నాడు. కీలక మ్యాచ్‌లో ధుల్ శతక్కొట్టడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. మరో ఎండ్‌లో ఉన్న షేక్ రషీద్(92) సైతం సెంచరీకి చేరువయ్యాడు. 45 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 237/2గా ఉంది.
హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన యువ భారత కెప్టెన్, వైస్ కెప్టెన్లు
India’s vice-captain Shaik Rasheed has brought up his half-century 👏#INDvAUS | #U19CWC pic.twitter.com/Eu3KkjQvcm
— Cricket World Cup (@cricketworldcup) February 2, 2022
షేక్ రషీద్ ఫిఫ్టి.. భారీ స్కోర్ దిశగా యువ భారత్
యువ భారత్ వైస్ కెప్టెన్ షేక్ రషీద్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతున్న రషీద్.. 77 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో ఈ ఫీట్‌ను సాధించాడు. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ ధుల్(80 బంతుల్లో 69) హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు. బౌండరీలతో విరుచుకుపడుతూ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. 36 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 153/2గా ఉంది.
యష్ ధుల్ హాఫ్ సెంచరీ.. 31 ఓవర్ల తర్వాత యువ భారత్ స్కోర్ 120/2
యువ భారత్ కెప్టెన్ యష్ ధుల్ బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 64 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అతను ఈ ఫీట్‌ను సాధించాడు. ధుల్‌కు మరో ఎండ్‌లో వైస్ కెప్టెన్ షేక్ రషీద్(63 బంతుల్లో 36; 2 ఫోర్లు) సహకరిస్తున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పే దిశగా సాగుతున్నారు. 31 ఓవర్ల తర్వాత టీమిండయా స్కోర్ 120/2.
హర్నూర్ సింగ్(16) ఔట్.. 37 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన యువ భారత్
జాక్ నిస్బెట్ బౌలింగ్‌లో తోబియాస్ స్నెల్కు క్యాచ్ ఇచ్చి హర్నూర్ సింగ్ ఔటయ్యాడు. ఫలితంగా యువ భారత్ 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో షేక్ రషీద్(7), కెప్టెన్ యష్ ధుల్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన యువ భారత్.. రఘువంశీ ఔట్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్‌కు ఆదిలోని షాక్ తగిలింది. ఓపెనర్ రఘువంశీని(6) విలియమ్స్ సల్జ్మ్యాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా టీమిండియా 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో హర్నూర్ సింగ్(5), షేక్ రషీద్ ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 18/1.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యువ భారత్
అండర్19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ జరుగుతున్న రెండో సెమీస్ పోరులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది
యువ భారత్ మరోసారి హిస్టరీ రిపీట్ చేయనుందా..?
గత రెండు అండర్–19 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన యువ భారత్.. మరోసారి హిస్టరీని రిపీట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతుంది. 2018 ఫైనల్లో పృథ్వీ షా నాయకత్వంలోని జట్టు ఆసీస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకోగా... 2020 క్వార్టర్ ఫైనల్లో టీమిండియా.. యువ కంగారూ జట్టుకు షాకిచ్చింది
Related News By Category
Related News By Tags
-
తయారీపై ‘టారిఫ్‌ల’ ప్రభావం
తయారీ రంగం పనితీరు నవంబర్‌లో కొంత బలహీనపడింది. తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి చేరింది. తయారీ రంగం పనితీరును సూచించే హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.6 పాయింట్లకు ప...
-
సెమీస్‌లో ఆసీస్ చిత్తు..
ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. సగర్వంగా ఫైనల్లో అడుగుపె...
-
అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ
ఆసియా క్రికెట్ మండలి పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత-‘ఎ’ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్-‘ఎ’ జట్టుతో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో జితేశ్ శర్మ సేన ఓటమిపాలైంది. ...
-
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
2026 పురుషుల అండర్ 19 ప్రపంచకప్ (వన్డే) షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (నవంబర్ 19) విడదల చేసింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలోని తొలి మ్యాచ్‌లో గత ఎడిషన్ రన్నరప్ భారత్, యూఎస్ తలపడనున్నాయి. అదే రోజ...
-
సంజూ, గిల్ కాదు!.. వాళ్లిద్దరే సరిజోడి
భారత టీ20 జట్టులో శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అవసరమా?.. క్రికెట్ వర్గాల్లో చాన్నాళ్లుగా ఇదే చర్చ. టెస్టు, వన్డేల్లో సత్తా చాటుతూ ఏకంగా కెప్టెన్‌గా ఎదిగిన ఈ పంజాబీ బ్యాటర్.. అంతర్జాతీయ పొట్టి ఫార్...


