IPL 2022: 'అతడు ఎక్స్‌ప్రెస్ బౌలర్‌.. త్వరలోనే భారత జట్టులోకి వస్తాడు'

Umran Malik will play for India very soon Says Michael Vaughan - Sakshi

ఐపీఎల్‌-2022లో సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తన పేస్‌ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఉమ్రాన్‌ గంటకు 145 కి.మీ స్పీడ్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో మాలిక్‌ను ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్‌ వాన్‌ ప్రశంసించాడు. ఈ ఎక్స్‌ప్రెస్ పేసర్ త్వరలో భారత్ జట్టు తరఫున ఆడతాడని వాన్ జోస్యం చెప్పాడు. " ఉమ్రాన్ మాలిక్ త్వరలో టీమిండియా తరపున ఆడడం ఖాయం. ఈ వేసవిలో అతడిని కౌంటీ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ పంపాలి. కౌంటీల్లో అతడు తన స్కిల్స్‌ను మరింత పెంపొందించుకునే అవకాశం ఉంది అని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నాడు.

ఇక ఈ ఏడాది సీజన్‌లో ఉమ్రాన్‌ కేవలం మూడు వికెట్లు పడగొట్టనప్పటికీ.. అతడు తన పేస్‌తో బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఏప్రిల్ 11న గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతున్న మాథ్యూ వేడ్ వికెట్‌ను మాలిక్‌ సాధించాడు. కాగా గతేడాది సీజన్‌లో నటరాజన్‌ గాయపడడంతో జట్టులోకి వచ్చిన ఉమ్రాన్‌ మాలిక్‌  తన స్థానాన్నిసుస్థిరం చేసుకున్నాడు. ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు మాలిక్‌ను రూ.4 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ రీటైన్‌ చేసుకుంది.

చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్‌ బౌలర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top