ఉదయ్‌వీర్‌ ‘పసిడి’ గురి | udhayveer sidhu wins gold medal in World Cup shooting tournament | Sakshi
Sakshi News home page

ఉదయ్‌వీర్‌ ‘పసిడి’ గురి

Oct 12 2026 4:40 AM | Updated on Oct 12 2026 4:40 AM

udhayveer sidhu wins gold medal in World Cup shooting tournament

కైరో: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ పతక బోణీ చేసింది. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో ఉదయ్‌వీర్‌ సిద్ధూ స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 24 ఏళ్ల ఉదయ్‌వీర్‌ 240.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. క్రిస్టియన్‌ రీట్జ్‌ (జర్మనీ; 240.1 పాయింట్లు) రజతం... పావ్‌లో మోనా (ఇటలీ; 219.8 పాయింట్లు) కాంస్యం  సాధించారు. 

చివరి రెండు షాట్‌లు మిగిలిన సమయానికి రీట్జ్‌ కంటే ఉదయ్‌వీర్‌ 0.3 పాయింట్లు వెనుకంజలో ఉన్నాడు. ఉదయ్‌వీర్‌ చివరి రెండు షాట్‌లలో 10.2, 9.8 పాయింట్లు... రీట్జ్‌ 9.6, 9.6 పాయింట్లు స్కోరు చేశారు. చివరకు ఉదయ్‌వీర్‌ 0.5 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో ఉదయ్‌వీర్‌ 585 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన సరబ్‌జ్యోత్‌ సింగ్‌ 574 పాయింట్లతో 31వ స్థానంలో, అజేంద్ర సింగ్‌ చౌహాన్‌ 580 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement