వచ్చే ఏడాది ప్రపంచ కప్‌ నుంచి న్యూజిలాండ్‌ ఔట్‌.. కారణం ఏంటంటే!

U 19 World Cup 2022: New Zealand Pull Out of U19 WC for Quarantine Restrictions - Sakshi

New Zealand Pull Out of U19 WC for Quarantine Restrictions: వచ్చే ఏడాది కరేబియన్ దీవుల్లో జరగనున్న అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌ గ్రూపుల వివరాలను ఐసీసీ బుధవారం ప్రకటించింది. అయితే ఈ ప్రపంచకప్‌ నుంచి న్యూజిలాండ్‌ అండర్‌-19 జట్టు అనుహ్యంగా చివరి నిమిషంలో  తప్పుకుంది. న్యూజిలాండ్‌లో ప్రస్తుతం కఠినమైన క్వారంటైన్‌ నిబంధనలు అమలు అవుతున్నాయి. ఈ క్రమంలో టీనేజర్లు దేశం దాటి వెళ్లి వస్తే కఠినమైన నిబంధనల మధ్య క్వారంటైన్‌లో ఉండాలి. దీంతో పలువురు క్రికెటర్‌లు విముఖత చూపడంతో న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా న్యూజిలాండ్‌ తప్పుకోవడంతో స్కాట్లాండ్‌ను చివరి నిమిషంలో చేర్చారు. ఇక 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బంగ్లాదేశ్, కెనడా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఇంగ్లండ్‌. గ్రూప్‌ ‘బి’లో ఉగాండ, ధక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లతో కలిసి  గత ప్రపంచకప్‌ రన్నరప్‌ భారత్‌కు చోటు కల్పించారు. గ్రూప్‌ ‘సి’లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, జింబాబ్వే, పాపువా న్యూగినియా. గ్రూప్‌ ‘డి’లో ఆ్రస్టేలియా, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్‌ జట్లుకు అవకాశం కల్పించారు. కాగా అండర్‌-19 ప్రపంచకప్‌కు వెస్టిండీస్ తొలి సారి అతిథ్యం ఇవ్వబోతుంది.

చదవండి: IND Vs NZ: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్‌, రాహుల్‌ జోడి..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top