IPL 2022: 'ఎస్‌ఆర్‌హెచ్‌కు 6.5 కోట్లు దండగ.. మరీ దారుణంగా ఆడుతున్నాడు'

Twitter comes hard at Sunrisers Hyderabad Opener Abhishek sharma failure - Sakshi

ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు మారినా.. ఆట తీరు మాత్రం మారడం లేదు. ప్రస్తుత సీజన్‌లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పటికీ ఆఖరి స్థానంలోనే ఉంది. తొలి మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చేతిలో 61 ప‌రుగుల తేడాతో ఓట‌మి చెందిన ఎస్‌ఆర్‌హెచ్‌.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు రషీద్‌ ఖాన్‌,  డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో వంటి స్టార్‌ ఆటగాళ్లను విడిచి పెట్టి అభిమానుల ఆగ్రహానికి గురైన ఎస్‌ఆర్‌హెచ్.. ప్రస్తుత ఆట తీరుతో మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా.. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో రూ.6.5 కోట్లు వెచ్చించి  ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసిన అభిషేక్‌ శర్మ తీవ్రంగా నిరాశపరుస్తున్న సంగతి తెలిసిందే.

అభిషేక్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతులు ఎదర్కొన్న అతడు.. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఇక లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 13 పరుగులు సాధించి పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్‌గా జట్టుకు అద్భుతమైన శుభారంభం ఇవ్వాల్సిన అభిషేక్‌ శర్మ.. తన ఆట తీరుతో రోజురోజుకూ జట్టుకు భారంగా మారుతున్నాడు.

ఈ క్రమంలో అభిషేక్‌ శర్మపై ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "హైదరాబాద్‌ తీరు మారదు. రూ. 6.5 కోట్లు పెట్టి  అభిషేక్‌ శర్మను ఎందుకు కొన్నారో.. గల్లీ క్రికెట్‌ కంటే దారుణంగా ఆడుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌కు రూ. 6.5 కోట్లు దండగ’’ అని అభిమానులు మండిపడుతు​న్నారు.

చదవండిIPL 2022: రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌.. ఆర్సీబీకి బ్యాడ్‌ న్యూస్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top