ట్రంప్ ఆర్డర్‌తో ఐఓసీ నిర్ణయం
లుసానే: లింగమార్పిడి మహిళా అథ్లెట్లపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) విధాన నిర్ణయం తీసుకుంది. ఇకపై విశ్వక్రీడల్లో అమ్మాయిగా మారిన అథ్లెట్లను అనుమతించరు. లింగమార్పిడి మహిళలపై నిషేధం విధిస్తున్నట్లు ఐఓసీ తెలిపింది. మరో రెండేళ్లలో లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడు.
పుట్టుకతో మహిళ లేదంటే పురుషుడైన అథ్లెట్లను మాత్రమే పోటీ పడేందుకు అర్హత కల్పించాలని ఆయన ఆదేశించారు. అగ్రదేశాధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు లోబడి ఐఓసీ... అథ్లెట్ల అర్హత విషయమై కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎవరైనా అమ్మాయిగా మారినా... వారిని మహిళల విభాగంలో అనుమతించరు. వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లకు ఈ కొత్త నిర్ణయం అమలవుతుందని ఐఓసీ స్పష్టం చేసింది. ఇకపై ఒలింపిక్స్ విశ్వక్రీడల్లో పాల్గొనాలంటే జన్మతః పురుషుడు, మహిళా అథ్లెట్లకు మాత్రమే అవకాశముంటుంది.


