ప్రసిధ్‌ కృష్ణ ‘పాజిటివ్‌’

Tim Seifert, Kolkata Knight Riders Star Tests Positive For Covid-19 - Sakshi

న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సీఫెర్ట్‌ కూడా

ముంబై: ఐపీఎల్‌ టి20 టోర్నీ వాయిదా పడిన తర్వాత మరో ఇద్దరు క్రికెటర్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ ఇద్దరూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) బృందంలోని సభ్యులే. పేస్‌ బౌలర్‌ ప్రసిధ్‌ కృష్ణ, న్యూజిలాండ్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ టిమ్‌ సీఫెర్ట్‌లకు కరోనా సోకినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘రెండు నెగెటివ్‌ ఫలితాలు వచ్చిన తర్వాత ఇతర భారత క్రికెటర్లలాగే ప్రసిధ్‌ కూడా మే 3న బబుల్‌ వీడాడు. అయితే స్వస్థలం బెంగళూరు చేరిన తర్వాత అతని రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

న్యూజిలాండ్‌కు చెందిన సీఫెర్ట్‌కు కూడా కరోనా రావడంతో అతను తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక విమానంలో స్వదేశం వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బయలుదేరే ముందు అతనికి చేసిన రెండు పరీక్షల్లో కూడా కరోనా ‘పాజిటివ్‌’ వచ్చింది. దాంతో సీఫెర్ట్‌ అహ్మదాబాద్‌లోనే ఆగిపోయాడు. సీఎస్‌కే బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ తరహాలోనే మెరుగైన చికిత్స కోసం సీఫెర్ట్‌ను కూడా చెన్నైకి తరలించనున్నారు. ఐసోలేషన్, ఆపై టెస్టులు నెగెటివ్‌గా వస్తేనే అతను న్యూజిలాండ్‌ పయనమవుతాడు. సీఫెర్ట్‌ ఆరోగ్యం గురించి తమకు పూర్తి సమాచారం ఉందని... బీసీసీఐతో పాటు అతను కోలుకునేందుకు తమవైపు నుంచి కూడా అన్ని రకాల సహకారం అందిస్తామని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ వైట్‌ వ్యాఖ్యానించారు.  

ప్రసిధ్‌కు సాధ్యమేనా...
ఇంగ్లండ్‌ పర్యటనకు సెలక్టర్లు ప్రకటించిన నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లలో ప్రసిధ్‌ కృష్ణ ఒకడు. టీమిండియా బృందం ఈ నెల 25న ప్రత్యేక బయో బబుల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆలోగా అతను నెగెటివ్‌గా తేలాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్‌ వెళ్లాల్సిన భారత క్రికెటర్లంతా కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకుంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవిషీల్డ్‌ను తీసుకుంటే అది ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి రెండో డోసు అక్కడా తీసుకోవచ్చనేది ఆలోచన. అయితే ప్రసిధ్‌ ఈ నెల 18 లేదా 20 వరకు నెగెటివ్‌గా తేలినా... వైద్య సూచనల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్‌కు కనీసం నాలుగు వారాల విరామం అవసరం. మరి ప్రసిధ్‌ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-05-2021
May 09, 2021, 03:59 IST
ముంబై: సుమారు మూడున్నర నెలల సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత క్రికెట్‌ జట్టు జూన్‌ 2న బయలుదేరనుంది. దానికి...
09-05-2021
May 09, 2021, 03:35 IST
కడుపులో దాచుకుంటుంది. కనురెప్పలా కాచుకుంటుంది. కష్టాన్ని ఓర్చుకోవడం నేర్పుతుంది. పోరాడే శక్తిని ఇస్తుంది. చీకట్లను సంహరించే వెలుగు ఖడ్గాన్ని చేతికి...
09-05-2021
May 09, 2021, 02:41 IST
1. పై ఫొటోలో ఆకుపచ్చ రంగువి ఆరోగ్యకరమైన కణాలు, ఎరుపురంగు చుక్కలు కరోనా వైరస్, నారింజ రంగులో మసకగా ఉన్నవి వైరస్‌ సోకి...
09-05-2021
May 09, 2021, 01:57 IST
సాక్షి, ముంబై: బ్రేక్‌ ద చైన్‌లో భాగంగా గత నెల 14వ తేదీన అమలు చేసిన లాక్‌డౌన్‌ గడువు ఈ...
09-05-2021
May 09, 2021, 00:56 IST
సాక్షి, న్యూఢిల్లీ: వారం రోజులుగా దేశవ్యాప్తంగా 180 జిల్లాలు, 14 రోజులలో 18 జిల్లాలు, 21 రోజులుగా 54 జిల్లాలు,...
08-05-2021
May 08, 2021, 23:13 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటుగా స్పందించింది. కరోనా సెకండ్...
08-05-2021
May 08, 2021, 21:53 IST
ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ బాబా సెహగల్‌ కరోనాపై అవగాహన కల్పిస్తూ పాడిన పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.....
08-05-2021
May 08, 2021, 20:46 IST
జైపూర్‌: ​కోవిడ్‌తో మరణించిన వ్యక్తి అంతిమయాత్రకు హాజరైనా వారిలో 21 మంది మృతి చెందారు. ఈ సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని శిఖర్‌ జిల్లాలోని...
08-05-2021
May 08, 2021, 20:25 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ లేఖ రాశారు. మెడికల్‌ ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌పై...
08-05-2021
May 08, 2021, 19:32 IST
ముంబై: టీమిండియా ఆటగాడు అజింక్య ర‌హానే క‌రోనా టీకా తీసుకున్నాడు. త‌న స‌తీమ‌ణి రాధిక‌తో క‌లిసి ముంబైలోని క‌రోనా వ్యాక్సిన్ కేంద్రంలో...
08-05-2021
May 08, 2021, 19:22 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,065 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
08-05-2021
May 08, 2021, 18:44 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.కరోనా రోగులకు...
08-05-2021
May 08, 2021, 18:01 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌...
08-05-2021
May 08, 2021, 17:28 IST
భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ (60)...
08-05-2021
May 08, 2021, 17:00 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అల్లకల్లోలాన్ని సృష్టించింది. వైరస్‌ ఇప్పటికీ కొన్ని దేశాల్లో తన ప్రభావాన్ని భీకరంగా చూపిస్తోంది. భారత్‌ లాంటి...
08-05-2021
May 08, 2021, 16:26 IST
హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో  ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్...
08-05-2021
May 08, 2021, 16:19 IST
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులకు శనివారం ఫోన్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌...
08-05-2021
May 08, 2021, 15:28 IST
రాగి జావ..కొర్ర బువ్వ..జొన్న రొట్టె.. ఇళ్లలో ఇప్పుడు ఇదే మెనూ. కుటుంబ సభ్యులంతా ఇష్టంగా తింటున్నారు. బయటి ఆహారానికి స్వస్తి...
08-05-2021
May 08, 2021, 15:20 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా విస్తరిస్తోంది.మరోవైపు ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్-వి అనే మూడు...
08-05-2021
May 08, 2021, 15:07 IST
ముంబై: కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top