Tim David: సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు..
IPL 2021 RCB Vs CSK Match Tim David: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో ఆర్సీబీ తరపున ఆరంగేట్రం చేసిన సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా తమ దేశం తరపున ఐపీఎల్‌లో ఆడుతున్న తొలి ఆటగాడిగా డేవిడ్ రికార్డులకెక్కాడు.
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి(53, 41 బంతులు; 6 ఫోర్లు, 1 సిక్సర్), పడిక్కల్(70, 50 బంతులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించినప్పటికి తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలం కావడంతో ఆర్‌సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కాగా కోహ్లి, పడిక్కల్ మధ్య 111 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం విశేషం. ఇక సీఎస్‌కే బౌలర్లలో బ్రావో 3, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చహర్ 1 వికెట్ తీశాడు.
చదవండి: IPL 2021: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఇంటి దారి పట్టిన స్టార్ ఆల్‌రౌండర్

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
