‘వాకా’లో కుదరదు | There Will Be Small Changes In India Tour Of Australia | Sakshi
Sakshi News home page

‘వాకా’లో కుదరదు

Sep 8 2020 2:41 AM | Updated on Sep 8 2020 3:01 AM

There Will Be Small Changes In India Tour Of Australia - Sakshi

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్‌ ప్రకారం భారత్‌ నేరుగా పెర్త్‌కు వెళ్లి అక్కడే బయో బబుల్‌ సెక్యూరిటీలో ఉండి తమ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే పెర్త్‌ మైదానం ఉన్న వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలో కరోనాకు సంబంధించి కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. క్రికెట్‌ జట్టుకైనా సరే... ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వలేమని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో భారత జట్టు ప్రణాళిక మారడం ఖాయమైంది. తాజా ప్రతిపాదన ప్రకారం భారత  జట్టు తమ తొలి మ్యాచ్‌ అడిలైడ్‌ లేదా బ్రిస్బేన్‌లలో ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement