Matteo Berrettini: 'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం

ఇటాలియన్ టెన్నిస్ స్టార్ మాటియో బెరెట్టిని సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఏటీపీ 500 క్వీన్స్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం డచ్‌కు చెందిన బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్‌పై 6-4, 6-3 తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాడు. బెరెట్టిని గ్రాస్ కోర్టులో తాను చివరగా ఆడిన 20 మ్యాచ్‌ల్లో ఇది 19వ విజయం కావడం విశేషం. ఆ ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా వింబుల్డన్ ఫైనల్. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో బెరెట్టిని పరాజయం పాలయ్యాడు.
కాగా మ్యాచ్ గెలిచిన అనంతరం ఇంటర్య్వూలో భాగంగా బెరెట్టినికి వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఒక యువతి.. ''మాటియో.. నన్ను పెళ్లి చేసుకుంటావా'' అని గట్టిగా అరిచింది. దీంతో షాక్ తిన్న బెరెట్టిని.. ఆ తర్వాత చిరునవ్వుతో ''ఈ విషయం గురించి ఆలోచించి చెబుతా'' అని సూపర్ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక ఫైనల్లో బెరెట్టిని సెర్బియాకు చెందిన ఫిలిప్ క్రాజినోవిక్‌తో తలపడనున్నాడు.
A post-match marriage proposal for @MattBerrettini 👀 💍#cinchChampionships pic.twitter.com/IzQiIG1EYG
— Tennis TV (@TennisTV) June 18, 2022
చదవండి: Stuart MacGill: 'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు'
Nick Kyrgios: 'తెలుసుకొని మాట్లాడితే మంచిది'.. రిఫరీతో దురుసు ప్రవర్తన
సంబంధిత వార్తలు