‘టాటా’ డబ్ల్యూపీఎల్‌  | TATA wins title rights for WPL 2023 | Sakshi
Sakshi News home page

‘టాటా’ డబ్ల్యూపీఎల్‌ 

Feb 22 2023 5:31 AM | Updated on Feb 22 2023 5:31 AM

TATA wins title rights for WPL 2023 - Sakshi

న్యూఢిల్లీ: భారత మల్టీనేషనల్‌ కంపెనీ ‘టాటా’ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కుల్ని  కైవసం చేసుకుంది. ఇప్పటికే ఈ దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం పురుషుల లీగ్‌ ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా ఉంది. ‘టాటా’ చైనా మోబైల్‌ సంస్థ ‘వీవో’ స్థానంలో ఐపీఎల్‌లోకి ప్రవేశించింది.

తాజాగా మహిళల లీగ్‌లోనూ భాగమైంది. ఐదేళ్ల పాటు డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా ‘టాటా’ కొనసాగనుంది. అయి తే ఎంతమేరకు ఈ ఒప్పందం కుదిరిందనే వివరాలను అటు బోర్డుగానీ, ఇటు కార్పొరేట్‌ సంస్థగానీ వెల్లడించలేదు. వచ్చే నెల 4 నుంచి డబ్ల్యూపీఎల్‌ పోటీలన్నీ ముంబైలోని రెండు వేదికలు బ్రబోర్న్, డీవై పాటిల్‌ స్టేడియాల్లో జరుగనున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement