T20 World Cup 2021 Pak Vs NZ: రెండు మేటి జట్లపై విజయాలు.. సెమీస్‌ దారిలో పాక్‌ ..

T20 World Cup 2021: Pakistan Beat New Zealand By 5 Wickets Closer To Semis - Sakshi

టి20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం

న్యూజిలాండ్‌పై ఐదు వికెట్లతో బాబర్‌ ఆజమ్‌ బృందం గెలుపు

నిప్పులు చెరిగిన రవూఫ్‌

రాణించిన ఆసిఫ్‌ అలీ, షోయబ్‌ మాలిక్‌

Pakistan Beat New Zealand By 5 Wickets Closer To Semis: రెండు మేటి జట్లపై వరుస విజయాలతో టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ జట్టు సెమీఫైనల్‌ దారిలో పడింది. షార్జాలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ ఆజమ్‌ బృందం ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఇక ఈ గ్రూప్‌–2లో పాక్‌కు ఎదురయ్యే జట్లు క్రికెట్‌ కూనలు (అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్‌) కావడంతో సెమీఫైనల్‌ బెర్త్‌ దాదాపు ఖాయమైంది. టాస్‌ నెగ్గిన పాకిస్తాన్‌ మళ్లీ బౌలింగ్‌ ఎంచుకుంది. షరామాములుగా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హారిస్‌ రవూఫ్‌ (4/22) కివీస్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు సాగనివ్వలేదు.


PC: PCB

దీంతో మొదట న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. డరైల్‌ మిషెల్‌ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కాన్వే (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఆడిన వారిలో మెరుగనిపించారు. కెప్టెన్‌ విలియమ్సన్‌ (25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) 20 పరుగుల మార్క్‌ను చేరుకోగా మిగతా వారంతా పాక్‌ బౌలింగ్‌కు తలవంచారు. షాహిన్‌ అఫ్రిది, ఇమాద్‌ వసీమ్, హఫీజ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 135  పరుగులు చేసి గెలిచింది.


PC:PCB

ఇక టాపార్డర్‌లో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (9), ఫఖర్‌ జమాన్‌ (11), హఫీజ్‌ (11) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. ఇన్నింగ్స్‌ను చక్కబెడుతున్న రిజ్వాన్‌ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) కూడా ని్రష్కమించడంతో పాక్‌ ఒకదశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అనుభవజ్ఞుడైన షోయబ్‌ మాలిక్‌ (20 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఆసిఫ్‌ అలీ (12 బంతుల్లో 27 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్సర్లు) జట్టును  గెలిపించారు. ఆసిఫ్‌ అలీ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో పాక్‌ మరో 8 బంతులుండగానే గెలిచింది. ఇష్‌ సోధి 2, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (బి) రవూఫ్‌ 17; మిషెల్‌ (సి) ఫఖర్‌ (బి) వసీమ్‌ 27; విలియమ్సన్‌ (రనౌట్‌) 25; నీషమ్‌ (సి) ఫఖర్‌ (బి) హఫీజ్‌ 1; కాన్వే (సి) బాబర్‌ (బి) రవూఫ్‌ 27; ఫిలిప్స్‌ (సి) హసన్‌ అలీ (బి) రవూఫ్‌ 13; సీఫర్ట్‌ (సి) హఫీజ్‌ (బి) షాహిన్‌ అఫ్రిది 8; సాన్‌ట్నర్‌ (బి) రవూఫ్‌ 6; సోధి (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 134. 
వికెట్ల పతనం: 1–36, 2–54, 3–56, 4–90, 5–116, 6–116, 7–125, 8–134. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 4–1–21–1, వసీమ్‌ 4–0–24–1, హసన్‌ అలీ 3–0–26–0, హారిస్‌ రవూఫ్‌ 4–0–22–4, షాదాబ్‌ 3–0–19–0, హఫీజ్‌ 2–0–16–1. 

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సోధి 33; బాబర్‌ ఆజమ్‌ (బి) సౌతీ 9; ఫఖర్‌ జమాన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సోధి 11; హఫీజ్‌ (సి) కాన్వే (బి) సాన్‌ట్నర్‌ 11; షోయబ్‌ మాలిక్‌ (నాటౌట్‌) 26; వసీమ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి)బౌల్ట్‌ 11; ఆసిఫ్‌ అలీ (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు 7; 
మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 135. 
వికెట్ల పతనం: 1–28, 2–47, 3–63, 4–69, 5–87. బౌలింగ్‌: సాన్‌ట్నర్‌ 4–0–33–1, సౌతీ 4–0–25–1, బౌల్ట్‌ 3.4–0–29–1, నీషమ్‌ 3–0–18–0, సోధి 4–0–28–2. 

చదవండి: T20 WC 2021: ఫోకస్‌గా లేవు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పక్కనపెడుతున్నా
T20 WC 2021: పాక్ విజయంపై ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top