IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్‌!

Suryakumar Yadav drops massive hint on Test debut - Sakshi

వైట్‌బాల్‌ క్రికెట్‌లో అదరగొడుతన్న టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. త్వరలోనే టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో రెండు సార్లు టెస్టుల్లో భారత జట్టుకు ఎంపికైనప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. కాగా న్యూజిలాండ్‌తో రెండో టీ20 అనంతరం మాట్లాడిన సూర్యకు టెస్టు క్రికెట్‌ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. బదులుగా త్వరలోనే భారత టెస్టు జట్టులోకి వస్తానని థీమా వ్యక్తం చేశాడు

త్వరలోనే టెస్టు క్రికెట్‌లోకి వస్తా..
"నా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌ను నేను రెడ్‌బాల్‌తో ప్రారంభించాను. ముంబై జట్టు తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. కాబట్టి టెస్టు ఫార్మాట్‌ గురించి నాకు పూర్తిస్థాయి అవగాహన ఉంది.అదే విధంగా టెస్టు క్రికెట్‌ ఆడటం నాకు చాలా ఇష్టం. తర్వలోనే టెస్టు క్యాప్‌ను అందుకుంటానని ఆశిస్తున్నాను" అని మ్యాచ్‌ అనంతరం విలేకరుల సమావేశంలో సూర్య పేర్కొన్నాడు.

రెండో టీ20లో అదరగొట్టిన సూర్య
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో సూర్య తన సెంచరీని కేవలం 49 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదర్కొన్న సూర్యకుమార్‌ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

కాగా తన కెరీర్‌లో సూర్యకు ఇదే రెండో అంతర్జాతీయ సెంచరీ. ఇంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని సూర్యనమోదు చేశాడు. కాగా అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో సూర్య కొనసాగుతున్నాడు.
చదవండి: IND vs NZ: సలాం సూర్య భాయ్‌.. కోహ్లి రికార్డు బద్దలు! ఏకైక భారత ఆటగాడిగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top