Superbet Rapid Chess: సూపర్‌బెట్‌ చెస్‌ టోర్నీ విజేత ఆనంద్‌ | Superbet Rapid Chess: Viswanathan Anand wins event with a round to spare | Sakshi
Sakshi News home page

Superbet Rapid Chess: సూపర్‌బెట్‌ చెస్‌ టోర్నీ విజేత ఆనంద్‌

May 22 2022 6:10 AM | Updated on May 22 2022 7:31 AM

Superbet Rapid Chess: Viswanathan Anand wins event with a round to spare - Sakshi

వార్సా (పోలాండ్‌): సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ విజేతగా అవతరించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఆనంద్‌ 14 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. శనివారం జరిగిన మూడు గేముల్లో ఆనంద్‌ ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక పరాజయం నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్‌ కేటాయించారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఆనంద్‌ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. 13 పాయింట్లతో రిచర్డ్‌ రాపోట్‌ (హంగేరి) రెండో స్థానంలో, 12 పాయింట్లతో డూడా జాన్‌ క్రిస్టాఫ్‌ (పోలాండ్‌) మూడో స్థానంలో నిలిచారు. నేటి నుంచి బ్లిట్జ్‌ విభాగంలో టోర్నీ జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement