KL Rahul: 'మరో రెండు మ్యాచ్‌లు చూస్తారు.. తర్వాత తీసేయడమే'

Sunil Gavaskar Warning KL Rahul Suggests Replacement T20 World Cup - Sakshi

ఆసియాకప్‌లోనూ టీమిండియా వైస్‌కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతుంది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన కేఎల్‌ రాహుల్‌.. ఆ తర్వాత హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 34 పరుగులు చేసినప్పటికి నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో బ్యాటింగ్‌ విభాగంలో తీవ్ర పోటీ నెలకొంది. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని బెస్ట్‌ టీమ్‌ను తయారు చేయాలని భావిస్తున్న బీసీసీఐకి ఎవరికి జట్టులో చోటు కల్పించాలనేది సమస్యగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కేఎల్‌ రాహుల్‌ మాత్రం  పూర్‌ ఫామ్‌తో తన స్థానానికి ఎసరు తెచ్చుకునేలా ఉన్నాడు.

ఇదే విషయమై టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ మాట్లాడాడు. కేఎల్‌ రాహుల్‌ ఇలాగే ఆడితే ఒకటి.. రెండు మ్యాచ్‌లు చూస్తారు.. ఆ తర్వాత ఇక జట్టులోంచి తీసేయడమే జరుగుతుందన్నారు.''టీమిండియాలో ఇప్పుడు కాంపిటీషన్ తీవ్రంగా పెరిగిపోయింది. జింబాబ్వే పర్యటనలో, అంతకుముందు వెస్టిండీస్ పర్యటనలో శుబ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మెప్పించాడు. కాబట్టి ఏ ప్లేయర్‌ అయినా వరుసగా ఫెయిల్ అవుతూ ఉంటే అతను ఫామ్‌లోకి వచ్చేదాకా వెయిట్ చేసే పరిస్థితి లేదు. టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలకు పెద్దగా సమయం కూడా లేదు.

ఈ విషయాలను కేఎల్ రాహుల్ దృష్టిలో పెట్టుకోవాలి. అతనికి రెండు, మూడు మ్యాచుల సమయం మాత్రమే ఉంది. ఆ మ్యాచుల్లో కూడా అతను విఫలమైతే... సెలక్టర్లు, ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తారు. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా.. ఇలా ఓపెనింగ్ స్లాట్ విషయంలో ఇప్పటికే టీమిండియా ప్రయోగాలు చేసింది. వీరితో పాటు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి కేఎల్ రాహుల్ ఎంత త్వరగా ఫామ్‌లోకి వస్తే అంత బెటర్. ఒకవేళ ఇలాగే ఆడితే మాత్రం జట్టు నుంచి తీసేయడం ఖాయం'' అంటూ పేర్కొన్నాడు.

సౌతాఫ్రికా టూర్ తర్వాత లంక, వెస్టిండీస్ టూర్లకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, గాయం కారణంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా 616 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, అదే ఫామ్‌ని అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగించలేకపోయాడు. గాయంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కి దూరమైన రాహుల్, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సమయానికి కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నా... కరోనా వచ్చి అతన్ని ఆడకుండా చేసింది. అనంతరం జింబాబ్వే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి సక్సెస్‌ అయిన రాహుల్‌ బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ప్రస్తుతం అదే చెత్త ఫామ్‌ను ఆసియాకప్‌లోనూ కొనసాగిస్తున్నాడు.

చదవండి: సూపర్‌-4కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్‌.. గాయంతో జడేజా ఔట్‌

Asia Cup 2022: 'రోహిత్‌ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top