Sunil Gavaskar: 33 ఏళ్లకు భూమిని తిరిగిచ్చేసిన భారత దిగ్గజ క్రికెటర్‌

Sunil Gavaskar Returns Unused Plot After 33 Years Maharashtra Government - Sakshi

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ 33 ఏళ్ల తర్వాత తనకు కేటాయించిన భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పడం చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళితే.. 1988లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేయాలంటూ సునీల్‌ గావస్కర్‌కు ముంబైలో బాంద్రా శివారులో 20వేల స్క్కేర్‌ఫీట్‌లలో ఒక ప్లాట్‌ను కేటాయించింది. 33 ఏళ్లు కావొస్తున్నప్పటికి గావస్కర్‌ అక్కడ క్రికెట్‌ అకాడమీని గాని.. అందుకు సంబంధించిన మౌళిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయలేదు.

ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్‌ గతేడాది గావస్కర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా బాంద్రాలో కేటాయించిన ప్లాట్‌లో అకాడమీని ఏర్పాటు చేయలేనంటూ గావస్కర్‌ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేకు బుధవారం లేఖ రాసినట్లు మహారాష్ట్ర హౌసింగ్‌ అండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంహెచ్‌ఏడీఏ) పేర్కొంది. కాగా గతంలో క్రికెట్‌ అకాడమీ విషయమై గావస్కర్‌.. సచిన్‌తో కలిసి ఉద్దవ్‌ను కలిసి ప్లాన్‌ వివరించారు. కానీ ఆ ప్లాన్‌ ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలోనే 33 ఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్న ప్లాట్‌ను ఇచ్చేయాలని గావస్కర్‌ను కోరగా.. ఆయన ప్రభుత్వానికి ఇచ్చేసినట్లు ఎంహెచ్‌డీఏ తెలిపింది.

చదవండి: Yuvraj Singh: టెస్టు క్రికెట్‌ చనిపోయే దశకు వచ్చింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top