Steve Smith: భారత పర్యటనలో ‘వార్మప్‌’ ఆడకపోవడం సరైందే: స్మిత్‌ 

Steve Smith Says-Right Decision Not-To Play Warm-up Match India Tour - Sakshi

సిడ్నీ: భారత పర్యటనలో వార్మప్‌తో కాకుండా నేరుగా టెస్టు సిరీస్‌తోనే ఆట మొదలు పెట్టడం సరైన నిర్ణయమేనని ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. భారత్‌లో తమకు సవాల్‌ స్పిన్‌తో ఉంటే వార్మప్‌ మ్యాచ్‌ పేస్‌ వికెట్‌పై ఏర్పాటు చేయడం జట్టుకు ఏమాత్రం మేలు చేయదని ఈ సీనియర్‌ బ్యాటర్‌ అభిప్రాయపడ్డాడు.

నాలుగు టెస్టుల పూర్తిస్థాయి సిరీస్‌ ఆడేందుకు రానున్న కంగారూ జట్టు కనీసం ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడకపోవడం ఆశ్చర్యపరిచింది. దీనిపై అతను ఆ్రస్టేలియన్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గత పర్యటనలో మేం గ్రీన్‌టాప్‌ (పేస్‌ పిచ్‌)పై సన్నాహక మ్యాచ్‌ ఆడాం. కానీ మాకు సిరీస్‌లో ఎదురైంది స్పిన్‌ ట్రాక్‌లు.

అలాంటపుడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడటం దండగ! దీనికంటే స్పిన్‌ పిచ్‌లపై సన్నద్ధమయ్యేందుకు నెట్స్‌లో స్పిన్‌ బౌలింగ్‌తో  ప్రాక్టీస్‌ చేయడమే ఉత్తమం. మా బోర్డు (క్రికెట్‌ ఆ్రస్టేలియా) ఈసారి వార్మప్‌ వద్దని మంచి పనే చేసింది’ అని అన్నాడు. భారత పర్యటనలో తమకు కఠిన సవాళ్లు తప్పవన్నాడు. ఈ నెల 9 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తొలి టెస్టుతో ద్వైపాక్షిక సిరీస్‌ మొదలవుతుంది.   

చదవండి: నెంబర్‌వన్‌కు అడుగుదూరంలో భారత క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top