
ఆగస్ట్‌లో ఆస్ట్రేలియాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జులై 24) ప్రకటించారు. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్‌లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్స్ హీరోలు బవుమా, మార్క్రమ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు.
వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత బవుమా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. మార్క్రమ్ మరికొందరు సీనియర్లతో పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ మధ్యలో సౌతాఫ్రికా జింబాబ్వేతో 2 టెస్ట్‌లు, ప్రస్తుతం ముక్కోణపు సిరీస్ (జింబాబ్వే, న్యూజిలాండ్) ఆడుతుంది.
ఇటీవలే టెస్ట్ అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ ప్రెనెలన్ సుబ్రాయెన్ సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల జట్టులో తొలిసారి స్థానం సంపాదించాడు. అలాగే హార్డ్ హిట్టర్ లుహాన్ డ్రి ప్రిటోరియస్ కూడా తొలిసారి వన్డే జట్టులో చోటు సాధించాడు. జింబాబ్వే సిరీస్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టీ20, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నాడు.
సీనియర్లు మార్క్రమ్, ర్యాన్ రికెట్లన్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. ఆసీస్‌తో సిరీస్ ఆగస్ట్ 10న మొదలుకానుంది. 10, 12, 16 తేదీల్లో టీ20లు.. 19, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి.
ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా టీ20 జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లుహాన్ డ్రి ప్రిటోరియస్, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రెనెలన్ సుబ్రాయెన్, రస్సీ వాన్‌డర్ డస్సెన్
ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా వన్డే జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, ఎయిడెన్ మార్క్రమ్, సెనురన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లుహాన్ డ్రి ప్రిటోరియస్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రెనెలన్ సుబ్రాయెన్