సారాతో రిలేషన్​.. శుభ్​మన్ గిల్​​ క్లారిటీ​

Shubman Gill Clear Airs On Sara Tendulkar Relation - Sakshi

క్రికెట్​ దిగ్గజం సచిన్​ టెండూల్కర్​ కూతురు సారాతో యంగ్ క్రికెటర్​ శుభమన్​​ గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ నడుస్తున్న ప్రచారం గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో వీళ్ల కనెక్షన్​​ గురించి మీమ్స్​ కుప్పలుగా కనిపిస్తుంటాయి. ​అయితే రిలేషన్​షిప్​పై ఇంతకాలం ఇద్దరిలో ఏ ఒక్కరు స్పందించిన సందర్భం లేదు. అయితే తాజాగా ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడు శుభ్మ​న్​ గిల్​​.

రీసెంట్​గా ఇన్​స్టాగ్రామ్​లో ఫ్యాన్స్​తో ఇంటరాక్ట్​ అయ్యాడు గిల్​. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘ఆర్​ యూ సింగిల్​’ అని అడిగాడు. ​ దానికి గిల్​ ‘అవును.. ఇప్పట్లో అలాంటి ఆలోచనే లేద’ని చెబుతూ.. పుకార్లకు చెక్​ పెట్టాడు. దీంతో వాళ్ల రిలేషన్​ ప్రచారం ఉత్తదేనని స్పష్టమైంది. చదవండి: గిల్​పై సారా ఫన్నీ కామెంట్​

కాగా, గిల్‌‌-సారా ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటారు. గిల్​​ బాగా ఆడినప్పుడల్లా సారా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో ఏదో నడుస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. దీనికితోడు ఈ జనవరిలో ఇద్దరూ ఒక పోస్టును సేమ్​ క్యాప్షన్​తో పెట్టారు. ‘ఐ స్పై’ అని కన్ను ఎమోజీని ఉంచారు. ఇది చూసి వాళ్లు డేటింగ్​లో ఉన్నారంటూ ఊహించుకుని కొన్ని మీడియా హౌజ్​లు​ కథనాలు రాశాయి. తాజా స్టేట్​మెంట్​తో ఆ పుకార్లకు చెక్​ పడింది. మరోవైపు శుభ్​మన్​ గిల్ వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్​​కు సన్నద్ధమవుతున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top