Mohammed Shami: అత్యుత్తమ గణాంకాలు.. షమీపై మరోసారి సంచలన ఆరోపణలు! వివాహేతర సంబంధాలు.. అరెస్టు చేయాలంటూ సుప్రీం కోర్టులో

Shocking Dowry Demands Extramarital Affairs Shami Estranged Wife Moves SC - Sakshi

Mohammed Shami- Hasin Jahan: ఐపీఎల్‌-2023లో అదరగొడుతున్న టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీని వ్యక్తిగత జీవితంలో మాత్రం సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. షమీ అరెస్టును అడ్డుకునే స్టేను ఎత్తివేయాలంటూ అతడి నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్‌ జహాన్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం.

కాగా స్త్రీ లోలుడు అంటూ మహ్మద్‌ షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్‌ జహాన్‌ తమ కుమార్తెతో కలిసి విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు నెలవారీ భరణంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలంటూ గతంలో కలకత్తా కోర్టులో ఆమె పిటిషన్‌ దాఖలు చేసింది. 

అక్కడ ఊరట
అయితే, న్యాయస్థానం మాత్రం షమీ ప్రతినెలా 1,30,000 రూపాయలు చెల్లిస్తే చాలంటూ క్రికెటర్‌కు ఊరటనిచ్చే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన హసీన్‌ జహాన్‌.. మరోసారి షమీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది.

లైంగిక అవసరాల కోసం యథేచ్ఛగా
‘‘మిస్టర్‌ షమీ దగ్గర వ్యక్తిగత అవసరాల కోసం +4........6 నంబర్‌తో సెకండ్‌ మొబైల్‌ ఫోన్‌ ఉండేది. ఈ డివైజ్‌ను ఉపయోగించి అతడు తన వివాహేతర సంబంధాలు కొనసాగించేవాడు. పడుపు వృత్తి చేసుకుని బతికేవాళ్లతో టచ్‌లో ఉండేవాడు. ఈ ఫోన్‌ను కోల్‌కతాలోని లాల్‌ బజార్‌ పోలీసులు గతంలో స్వాధీనం చేసుకున్నారు.

అయితే, షమీ ఇప్పుడు కూడా తన లైంగిక అవసరాల కోసం యథేచ్ఛగా సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు’’ అని హసీన్‌ జహాన్‌ పిటిషన్‌లో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అదే విధంగా వరకట్నం కోసం షమీ తనను వేధించాడని హసీన్‌ ఆరోపించినట్లు సమాచారం. 

అతడిని అరెస్టు చేయాలి!
అంతేగాక.. టీమిండియాతో విదేశీ పర్యటనల్లో ఉన్నపుడు సైతం షమీ అక్కడి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాడంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తి నాలుగేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడని వెంటనే అతడిని అరెస్టు చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని ఆమె అత్యుత్తమ న్యాయస్థానాన్ని కోరినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌-2023లో అత్యుత్తమంగా
ఈ మేరకు షమీ అరెస్టుకు వ్యతిరేకంగా కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని న్యాయస్థానానికి ఆమె విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా గతంలో షమీ అరెస్టుకై హసీన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా వెస్ట్‌ బెంగాల్‌ సెషన్స్‌ కోర్టు అందుకు సానుకూలంగా స్పందించింది. అయితే, షమీ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు వారెంట్‌పై స్టే విధించింది. అయితే, ఇప్పుడు ఆ ఆదేశాలను సవాలు చేస్తూ హసీన్‌ సుప్రీంను ఆశ్రయించింది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు షమీ. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ క్రమంలో అదేరోజు అతడికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు కావడం గమనార్హం.

చదవండి: ఐపీఎల్‌ 2023లో ఏం జరుగుతోంది..? ఆ రెండు మ్యాచ్‌లు ఫిక్స్‌ అయ్యాయి..!
కోహ్లి, గంభీర్‌లను సస్పెండ్‌ చేసి పాడేయండి.. ఓవరాక్షన్‌ ఎక్కువైంది..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top