Shane Warne: స్పిన్ మాంత్రికుడి తుది వీడ్కోలుకు తేదీ ఖరారు

Shane Warne Funeral To Be Held At Melbourne Cricket Ground On March 30 - Sakshi

Shane Warne Funeral: ఈనెల (మార్చి) 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన స్పిన్ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ అంత్యక్రియలు ఘనంగా జరపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ సాయంత్రం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య వార్న్‌ తుది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించేందుకు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. 

ఎంసీజీతో వార్న్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా అంతిమ సంస్కారాలు ఇక్కడే నిర్వహించాలనుకున్నామని విక్టోరియా రాష్ట్ర సర్వోన్నతాధికారి డేనియల్‌ ఆండ్రూస్‌ బుధవారం వెల్లడించారు. వార్న్ విగ్రహం కూడా  ఎంసీజీ బయటే ఉండటంతో అభిమానులంతా అక్కడే నివాళులర్పిస్తున్నారు. వార్న్‌ పార్ధివ దేహం థాయ్‌లాండ్‌ నుంచి ఆస్ట్రేలియాకు రావాల్సి ఉంది.  

కాగా, 1969  సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించిన వార్న్.. అండర్-19 విభాగంలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1992లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వార్న్‌.. తన స్పిన్‌ మాయాజాలంతో పదిహేనేళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాశించాడు. ఈ క్రమంలో 145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్‌లో లంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 
చదవండి: Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top