రాజకీయాల్లోకి షకీబ్.. బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో పోటీ! | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి షకీబ్.. బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో పోటీ!

Published Mon, Nov 20 2023 9:15 PM

Shakib Al Hasan Makes Debut In Politics: Reports - Sakshi

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌, స్టార్‌ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ​కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వరల్డ్‌ క్లాస్‌ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన షకీబ్‌.. రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ​వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ పార్టీ తరఫున నామినేషన్‌ వేసేందుకు షకీబ్‌ సిద్దమవుతున్నాడు.

ఇప్పటికే బీఏఎల్‌ నుంచి ఇప్పటికే మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను తీసుకున్నట్లు స​మాచారం. ఈ విషయాన్ని బీఏఎల్‌ సంయుక్త కార్యదర్శి బహుద్దిన్ నసీమ్‌  ధృవీకరించారు. "షకీబ్‌ ఒక సెలబ్రిటీ, అతడు బంగ్లా యువతలో మంచి పాపులారిటీని కలిగి ఉన్నాడు.

మా పార్టీ నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు" అని నసీమ్‌ ఓ స్దానిక న్యూస్‌ ఛానల్‌తో పేర్కొన్నారు. ఇప్పటికే అధికార పార్టీ తరఫున షకిబ్‌ అభ్యర్థిత్వాన్ని బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ధ్రువీకరించారు.
చదవండి: CWC Final: వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్‌ షా అఫ్రిది పోస్ట్‌ వైరల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement