'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు'

Sehwag Says Australians Shouldnt Complain Of Chahal Substitution - Sakshi

ఢిల్లీ : ఆసీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన యజ్వేంద్ర చహల్‌ మూడు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. టీమిండియా గెలిచినదానికంటే కాంకషన్‌ పద్దతిలో ఆటగాడిని తీసుకొచ్చి గెలిచిదంటూ ఆసీస్‌ జట్టు ఆరోపణలు చేసింది. అయితే టీమిండియా తీసుకున్న కాంకషన్‌ నిర్ణయం కరెక్టేనా అన్నదానిపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించాడు. (చదవండి : టీమిండియా ‘కాంకషన్‌‌’ రైటా... రాంగా!)

'టీమిండియా కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌పై తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. బ్యాటింగ్‌ సమయంలో స్టార్క్‌ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా తలకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే నొప్పి వస్తుందని చెప్పలేం.. గాయం నొప్పి తెలియడానికి గంట పట్టొచ్చు.. ఒక్కసారి 24 గంటలు కావొచ్చు.  ఆ సమయంలో జడేజాకు నొప్పి తెలియలేదు.. ఫిజియో రాకపోయినా బ్యాటింగ్‌ చేశాడు. కానీ ఇన్నింగ్స్‌ ముగించుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌కు రాగానే హెల్మట్‌ తీసిన జడేజాకు నొప్పి తెలిసినట్లుంది. అందుకే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో అతను ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు.

మ్యాచ్‌ సమయంలో ఎవరైనా ఆటగాడు గాయపడితే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ కింద వేరొక ఆటగాడిని బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌కు అనుమతించొచ్చని ఐసీసీ నిబంధనల్లో ఉంది. దానినే టీమిండియా ఆచరించింది. జడేజా స్థానంలో చహల్‌ను కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా ఆడించింది. చహల్‌ మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు కాబట్టి ఇప్పుడు కాంకషన్‌ పదం ఆసీస్‌కు వివాదంలా కనిపిస్తుంది. అదే ఒకవేళ టీమిండియా ఓడిపోయుంటే ఆసీస్‌ ఇలానే వివాదం చేసేదా..

అయినా కాంకషన్‌ నిర్ణయంపై ఆసీస్‌కు మాట్లాడే అర్హత లేదు, ఎందుకంటే కాంకషన్‌ను మొదట ఉపయోగించిదన్న విషయం అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఇదే ఆసీస్‌ గాయపడిన స్మిత్‌ స్థానంలో మార్నస్‌ లబుషేన్‌ను ఆడించింది. ఆ మ్యాచ్‌లో లబుషేన్‌ రాణించడమే గాక జట్టును గెలిపించాడు.నేను బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో నా తలకు చాలాసార్లు గాయాలు అయ్యాయి.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ మా రోజుల్లో ఇలాంటి రూల్స్‌ లేకపోవడంతో 10 మందితోనే ఆటను కొనసాగించేవారు. అయినా మ్యాచ్‌ రిఫరీ బూన్‌ తన విచక్షణాధికారంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కాంకషన్‌పై ఆసీస్‌ ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : నటరాజన్‌ రాకతో షమీకి కష్టమేనా : మంజ్రేకర్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top