IPL 2022 RR Vs GT: "అది ఒక చెత్త నిర్ణయం.. అశ్విన్‌ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు అవసరమా"

Sanjay Manjrekar Slams Rajasthan Royals For Bizarre Tactic vs Gujarat Titans - Sakshi

ఐపీఎల్‌-2022లో నాలుగో విజయాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ నమోదు చేసింది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్లో  37 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ ఆదిలోనే పడక్కల్‌ వికెట్‌ కోల్పోయింది.

అయితే రవిచంద్రన్‌ అశ్విన్‌ ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. 8 బంతులు ఎదుర్కొన్న అశ్విన్‌ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. అయితే ఫస్ట్‌ డౌన్‌లో అశ్విన్‌ బ్యాటింగ్‌కు పంపడాన్ని భారత మాజీ క్రికెటర్‌​ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇటువంటి ప్రయోగాలు ఎందుకు చేస్తోందో అర్ధంకావడం లేదని అతడు విమర్శించాడు.

"సంజూ శాంసన్ మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు సిద్దంగా ఉన్నాడు. అటువంటి అప్పుడు అశ్విన్‌కు పంపాల్సిన అవసరం ఏముంది. బట్లర్ దూకుడుగా ఆడుతున్నప్పడు.. అతడి జోడిగా మూడో స్థానంలో శాంసన్‌ వచ్చే ఉంటే బాగుండేది. అశ్విన్‌ను ఆ స్థానంలో హిట్టింగ్‌ కోసం పంపారని  నేను అనుకుంటున్నాను. కానీ అది అవసరం లేదు.  లక్ష్యం 215 పరుగులు పైగా ఉంటే ఇటువంటి ప్రయోగాలు చేసినా పర్వాలేదు.

కాగా ఒకరిని బ్యాటింగ్‌ పంపేటప్పుడు అతడికి హిట్టింగ్‌ చేయగల సామర్థ్యం ఉందా లేదా అన్న విషయాన్ని ముందే తెలుసుకోవాలి. బట్లర్‌ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. అటువంటి సమయంలో రాజస్తాన్‌ ఇటువంటి నిర్ణయం ఎందకు తీసుకుందో నాకు అర్ధం కావడం లేదు. ఇది ఒక చెత్త నిర్ణయం" అని  సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: 'రాజస్థాన్ రాయల్స్‌కే కాదు.. భారత్‌కు అత్యత్తుమ ఫినిషర్‌ అవుతా'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top