India VS South Africa 2021: Captain Rohit Sharma Ruled Out Due to Injury - Sakshi
Sakshi News home page

IND Vs SA: టీమిండియాకు భారీ షాక్‌.. టెస్ట్‌ సిరీస్‌ నుంచి రోహిత్‌ ఔట్‌!

Dec 13 2021 5:47 PM | Updated on Dec 13 2021 7:21 PM

Rohit Sharma Suffers Injury During Practice Session Ahead of South Africa Tour Says Report - Sakshi

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా టెస్ట్‌ సిరీస్‌కు దూరం కానున్నడానే వార్తలు వినిపిస్తున్నాయి.  రోహిత్‌ శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం.. సోమవారం ముంబైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర వేసిన బంతి రోహిత్‌ చేతిని బలంగా తాకినట్లు తెలుస్తోంది. దీంతో అతడు కాపేపు నొప్పితో విలవిలాడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ప్రస్తుతం అతడి గాయం తీవ్రంగా మారినట్లు సమాచారం.

దీంతో అతడు టెస్ట్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్నట్లు వినికిడి. అతడి స్ధానంలో భారత్‌-ఏ జట్టు కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ను ఎంపిక చేసినట్లు రిపోర్ట్స్‌ తెలుపుతున్నాయి. అయితే రోహిత్‌ గాయంకు సంబంధించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన కోసం ముంబైలోని ఓ హోటెల్‌లో మూడు రోజుల క్వారంటైన్ గడుపుతోంది. అనంతరం భారత జట్టు డిసెంబర్‌16న  సౌతాఫ్రికాకు పయనం కానుంది. 

భారత టెస్ట్‌ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్

చదవండి: Virat kohli: ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ.. కోహ్లికి నో ఛాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement