
Aakash Chopra 2021 Test XI: టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా 2021గాను బెస్ట్ టెస్ట్ ఎలెవన్ ను ప్రకటించాడు. తన ప్రకటించిన జట్టుకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఆకాష్ చోప్రాను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా శ్రీలంక కెప్టెన్ దిమిత్ కరుణరత్నే, టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌కు మూడో స్ధానంలో, విలియమ్సన్ నాలుగో స్ధానంలో చోటు ఇచ్చాడు. పాకిస్తాన్ ఆటగాడు ఫావడ్ ఆలాంకు ఐదో స్ధానంలో చోటు దక్కింది.
వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను ఎంచుకున్నన్నాడు. ఆల్ రౌండర్ కోటాలో కైల్ జామీసన్, రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు ఇచ్చాడు. ఇక బౌలర్ల కోటాలో అక్షర్ పటేల్, షాహీన్ ఆఫ్రిది, జేమ్స్ అండర్సన్‌కు చోప్రా అవకాశం ఇచ్చాడు. అయితే ఆకాష్ చోప్రా ప్రకటించిన ఈ జట్టులో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లికు చోటు దక్కక పోవడం గమనర్హం.
చదవండి: Ruturaj Gaikwad: అతడికి ఇప్పుడు 18, 19 కాదు.. 24.. 28 ఏళ్లకు ఆడిస్తారా? వన్డే జట్టులోకి తీసుకోండి!