Usain Bolt: బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్‌ నుంచి 97 కోట్లు మాయం

Reports: Usain Bolt Loses 12 Million US-Dollars In Financial Scam - Sakshi

జమైకా దిగ్గజ అథ్లెట్‌.. ఒలింపియన్‌ ఉసెన్‌ బోల్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బోల్డ్‌ అకౌంట్‌ నుంచి దాదాపు 12 మిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైనట్లు సమాచారం. అకౌంట్‌ నుంచి మాయమైన డబ్బంతా బోల్ట్‌ లైఫ్‌టైమ్‌ సేవింగ్‌ డబ్బులని అతని లాయర్‌ లింటన్‌ పి. గార్డన్‌ తెలిపారు.

కింగ్‌స్టన్‌ అనుబంధ కంపెనీలో స్టాక్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌లో బోల్ట్‌ పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. తాజాగా షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్‌ అనుమతి లేకుండానే అతని అకౌంట్‌ నుంచి డబ్బు మాయం చేశారని లాయర్‌ తెలిపారు. ప్రస్తుతం బోల్డ్‌ అకౌంట్‌లో కేవలం 12వేల డాలర్లు మాత్రమే మిగిలాయన్నారు. ఈ వ్యవహారంపై తాము కోర్టులో కేసు వేయనున్నట్లు బోల్ట్‌ తరపు లాయర్‌ గార్డన్‌ వెల్లడించారు.

''ఇది వినడానికి షాకింగ్‌గా ఉంది. బోల్ట్‌ ఇన్వెస్ట్‌ చేసిన షేర్స్‌ నష్టాలు రావడంతో అనుమతి లేకుండా అతని అకౌంట్‌లో డబ్బులు మాయం చేయడం ఏంటని.. ఆ డబ్బులు బోల్ట్‌ లైఫ్‌టైమ్‌ సేవింగ్స్‌ అని.. ప్రైవేటు పెన్షన్‌ రూపంలో వాటిని పొందాలని బోల్ట్‌ ఇది వరకే బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ముందస్తు సమాచారం లేకుండా అకౌంట్‌ నుంచి డబ్బుల మాయం చేసిన కింగ్‌స్టన్‌ అనుబంధ సంస్థపై కోర్టులో కేసు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం'' అంటూ లాయర్‌ గార్డన్‌ తెలిపారు.

2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్‌.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ ఈవెంట్స్‌ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించి ఉసెన్‌ బోల్ట్‌ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు.

చదవండి: Hashim Amla: మచ్చలేని క్రికెటర్‌.. కోహ్లితో పోటీపడి పరుగులు

మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మొహం చూడకూడదని గోడ కట్టించింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top