కోహ్లి 2020

Record Totals For Both India And Australia - Sakshi

సిడ్నీ: ప్రస్తుత టీమిండియా-ఆస్ట్రేలియాల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకూ జరిగిన రెండో వన్డేల్లో పరుగుల మోత మోగింది. తొలి వన్డేలో ఇరుజట్లు కలిపి 682 పరుగులు సాధిస్తే, అది రెండో వన మరింత పెరిగింది. రెండో వన్డేల్లో ఇరుజట్లు కలిపి 727 పరుగులు సాధించాయి. ఇక్కడ ఆసీస్‌ 389 పరుగులు సాధిస్తే,  టీమిండియా 338 పరుగులు చేసింది. ఇలా ఆసీస్‌ గడ్డపై ఒక వన్డే మ్యాచ్‌లో ఏడొందలకుపైగా పరుగులు రావడం ఇదే మొదటిసారి. 2015వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు 688 పరుగులు సాధించాయి. ఇప్పటివరకూ ఆసీస్‌లో ఇదే అత్యుత్తమ రికార్డు కాగా, తాజాగా దీనికి బ్రేక్‌ పడింది. (‘బుమ్రాను ఎలా వాడాలో తెలియని కెప్టెన్సీ ఇది’)

తలొక పది సిక్స్‌లు
ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇరుజట్లు తలో 10 సిక్స్‌లు సాధించాయి. అంటే 20 సిక్స్‌లు వచ్చాయి. ఫలితంగా ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేల పరంగా చూస్తే ఒక వన్డేలో అత్యధిక సిక్స్‌లు వచ్చిన జాబితాలో ఇది రెండో అత్యుత్తమంగా నిలిచింది. 2015 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా 22 సిక్స్‌లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో నిన్నటి మ్యాచ్‌ నిలిచింది. 

కోహ్లి 2020
ఆసీస్‌పై వన్డే ఫార్మాట్‌లో విరాట్‌ కోహ్లి రెండు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా ఆసీస్‌పై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. ఆసీస్‌పై ఇప్పటివరకూ కో సాధించిన పరుగులు 2020. ఇక కోహ్లి 22 వేల అంతర్జాతీయ పరుగుల్ని సైతం పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌తో నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా 22వేల పరుగుల మైలురాయిని చేరాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ సాధించిన క్రికెటర్‌గానిలిచాడు. కోహ్లి 462 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించగా, అంతకముందు ఈ రికార్డు సచిన్‌ పేరిట ఉండేది. సచిన్‌ 493 ఇన్నింగ్స్‌ల్లో 22వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. (‘హార్దిక్‌ను కూడా ఎంపిక చేయను’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top