RCB VS LSG: ఫాస్టెస్ట్‌ ఫిఫ్టితో పాటు పూరన్‌ ఖాతాలో మరో రికార్డు

RCB VS LSG: Nicholas Pooran Completes 1000 IPL Runs - Sakshi

IPL 2023: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్‌ 10) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తాజా సంచలనం నికోలస్‌ పూరన్‌ ఐపీఎల్‌ సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి (15 బంతుల్లో) సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొత్తం 19 బంతులు ఎదుర్కొన్న పూరన్‌.. 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 62 పరుగులు బాదాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్‌లో జాయింట్‌ సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి (సునీల్‌ నరైన్‌, యూసఫ్‌ పఠాన్‌తో కలిసి)తో పాటు మరో మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్‌తో కలిపి మొత్తం 51 మ్యాచ్‌లు ఆడిన పూరన్‌.. 157. 87 స్ట్రయిక్‌ రేట్‌తో 1000 పరుగుల మార్కును దాటాడు (1053). 

ఇదిలా ఉంటే, నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌  వికెట్‌ తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి గెలుపొందింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్‌ (46 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో తొలుత స్టోయినిస్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత  పూరన్‌ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో లక్నో విజయం సాధించింది. లక్నో గెలుపు పరుగు బై రూపంలో రావడం విశేషం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top