ఐటీఎఫ్‌ టోర్నీలో రన్నరప్‌గా రష్మిక జోడీ  | Rashmika Jodi as the runner-up in the ITF tournament | Sakshi
Sakshi News home page

ఐటీఎఫ్‌ టోర్నీలో రన్నరప్‌గా రష్మిక జోడీ 

Feb 26 2023 2:56 AM | Updated on Feb 26 2023 2:56 AM

Rashmika Jodi as the runner-up in the ITF tournament - Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీ లో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గుర్‌గ్రామ్‌లో శనివారం జరిగిన డబుల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ రష్మిక–వైదేహి చౌదరీ (భారత్‌) జోడీ 2–6, 2–6తో రెండో సీడ్‌ జీల్‌ దేశాయ్‌ (భారత్‌)–పునిన్‌ కొవాపిటుక్‌టెడ్‌ (థాయ్‌లాండ్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది. సింగిల్స్‌ విభాగంలో రష్మిక పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement