మహారాజా ట్రోఫీ కెఎస్‌సీఏ టీ20 టోర్నీలో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో 'కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్' జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సమిత్.. బుధవారం హుబ్లీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
20 ఏళ్ల సమిత్ బ్యాక్-ఫుట్ కట్స్, లాఫ్టెడ్ డ్రైవ్స్, అద్భుతమైన పుల్ షాట్లతో తన తండ్రిని తలపించాడు. కేవలం 23 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులు సాధించాడు. అతడి బ్యాటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రోహన్ పాటిల్ (38 బంతుల్లో 64) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రవీణ్ దూబే (28 బంతుల్లో 51), సమిత్(32), శివరాజ్ (7 బంతుల్లోనే 23 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హుబ్లీ బౌలర్లలో వైభవ్ శర్మ 3, అభిషేక్ అహ్లావత్ 2 వికెట్లు పడగొట్టారు.
204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హుబ్లీ టైగర్స్ చివరి బంతి వరకు పోరాడింది. మన్వంత్ కుమార్ కేవలం 22 బంతుల్లోనే 60 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. శివకుమార్ రక్షిత్ (41), అనీశ్వర్ గౌతమ్ (34), అభినవ్ మనోహర్ (21) కీలక సహకారం అందించారు.
ఆఖరి బంతికి హుబ్లీ గెలుపునకు 5 పరుగులు అవసరం కాగా.. బెంగళూరు పేసర్ నిశ్చిత్ రావు కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బెంగళూరు బౌలర్లలో నిశ్చిత్ రావు మూడు, విద్వత్ కావేరప్ప రెండు వికెట్లు పడగొట్టారు.
Samit Dravid had the whole field covered 🤩
Catch all the action from the Maharaja Trophy KSCA T20 2026 LIVE on FanCode 📲#MaharajaTrophy pic.twitter.com/gurjHdavpE— FanCode (@FanCode) July 1, 2026


