ఈసారి పుజారా ఎవరో చూడాలి : ద్రవిడ్‌ | Rahul Dravid Explains What India Need To Do Beat Australai | Sakshi
Sakshi News home page

ఈసారి పుజారా ఎవరో చూడాలి : ద్రవిడ్‌

Dec 11 2020 3:46 PM | Updated on Dec 11 2020 5:45 PM

Rahul Dravid Explains What India Need To Do Beat Australai - Sakshi

సిడ్నీ : ఆసీస్‌తో జరగబోయే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈసారి పుజారా ఎవరు కానున్నారనేది చూడాల్సి ఉందని టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌ను ఉద్దేశించి ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : బుమ్రా షాట్‌.. ఆసీస్‌ బౌలర్‌కు గాయం)

'ఈసారి ఆసీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ఎవరు చతేశ్వర్‌ పుజారా కానున్నారో చూడాలి. ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం ఆసీస్‌ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో పుజారా అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. మూడు సెంచరీలు కలుపుకొని 521 పరుగులు సాధించాడు. మరి ఈసారి వేరే బ్యాట్స్‌మెన్‌ ఆ పరుగులు సాధిస్తారా లేక మళ్లీ పుజారానే దానిని రిపీట్‌ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అదే విధంగా టీమిండియా బౌలింగ్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఐదు రోజుల్లో టీమిండియా బౌలర్లకు 20 వికెట్లు తీయడం కష్టం కాకపోవచ్చు.. బ్యాట్స్‌మన్లకు అలా వీలు పడదు. ప్రతీసారి ఒక  సిరీస్‌లో బ్యాట్స్‌మన్‌కు 500 పరుగులు చేయడం సాధ్యం కాదు. కానీ బ్యాట్స్‌మన్‌ లయ అందుకుంటే బౌలర్లకు మాత్రం కష్టమే' అంటూ ద్రవిడ్‌ తెలిపాడు. ప్రస్తుతం ద్రవిడ్‌ ఎన్‌సీఏ క్రికెట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. (చదవండి : సిక్స్‌తో బుమ్రా హాఫ్‌ సెంచరీ.. వీడియో వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement