Rahul Dravid: హెడ్‌ కోచ్‌గా ఎంపికవ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవం

Rahul Dravid Comments After Selected Team India Head Coach - Sakshi

Rahul Dravid Comments After Selected As Team India Head Coach.. టీమిండియా హెడ్‌కోచ్‌గా మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎంపికవ్వడంపై ద్రవిడ్‌ స్పందించాడు. ''భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఎంపికవ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవం. కోచ్‌గా జట్టుతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా. రవిశాస్త్రి మార్గనిర్దేశంలో భారత జట్టు గొప్ప విజయాలను సాధించింది. నేను దీన్ని కొనసాగిస్తాననే నమ్మకంతో ఉన్నా. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న కొందరు ప్లేయర్లతో ఎన్‌సీఏ చీఫ్‌గా, భారత్‌ అండర్‌–19, భారత్‌ ‘ఎ’ జట్ల కోచ్‌గా నేను ఇప్పటికే పనిచేశా. రాబోయే రెండేళ్లలో టి20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలు ఉన్నాయి. వాటిల్లో మంచి ఫలితాలు సాధించేందుకు టీమ్‌ సభ్యులతో, సహాయక సిబ్బందితో కలిసి పనిచేస్తా.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక ఈనెల 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే టి20 సిరీస్‌ నుంచి కోచ్‌ హోదాలో ద్రవిడ్‌ టీమిండియా డగౌట్‌లో దర్శనం ఇవ్వనున్నాడు. భారత్‌లో జరిగే 2023 వన్డే వరల్డ్‌కప్‌ వరకు ద్రవిడ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవిలో ఉంటాడు. గతంలో ద్రవిడ్‌ శిక్షణలో భారత అండర్‌–19 జట్టు రెండుసార్లు అండర్‌–19 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరి రన్నరప్‌గా నిలి చింది. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత రవిశాస్త్రి హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకోనున్నాడు.   

చదవండి: Rahul Dravid As Team India Head Coach: అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top