ఐపీఎల్ 2026 సీజన్‌కు మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో టోర్నీలోని అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. కొన్ని జట్లలోని ఆటగాళ్లు ఇంట్రాస్వ్కాడ్‌లుగా విడిపోయి మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆటగాళ్లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ లీగ్‌కు ఊపు తెస్తున్నారు.
ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించి తుది జట్టులో ఎవరెవరికీ చోటు దక్కుతుందనే దానిపై మాజీ క్రికెటర్లు జోరుగా ఊహాగానాలు వ్యక్తం చేస్తూ తమ ప్రాబబుల్ ఎలెవెన్‌ను ప్రకటించే పనిలో పడ్డారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు.
అయితే తాను ప్రకటించిన జట్టులో భారత బౌలర్ తుషార్ దేశ్‌పాండేకు చోటు కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రాజస్థాన్ రాయల్స్ తుషార్ దేశ్‌పాండేను రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అశ్విన్ ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా వైభవ్ సూర్యశంశీ, జైశ్వాల్‌లు, మూడో స్థానంలో కెప్టెన్ రియాన్ పరాగ్‌కు చోటు కల్పించాడు.
మిడిలార్డర్‌లో హెట్‌మైర్, ధ్రువ్ జురేల్, ఫెరీరాలకు అవకాశమిచ్చాడు. జడేజాను ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆర్చర్, బిష్ణోయి, సందీప్ శర్మలకు చోటు కల్పించాడు. ‘నా దృష్టిలో హెట్‌మైర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఉత్తమం. టీ20 ప్రపంచకప్‌లో విండీస్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దుమ్మురేపాడు. అందుకే నాలుగోస్థానం అతడికి సరైనది. ఫినిషింగ్ బాధ్యతలు జడేజా, ఫెరీరాలు చూసుకుంటారు.
నా వరకు ఇది బెస్ట్ టీం. నేను ప్రకటించిన జట్టులో ఒకటి, రెండు మార్పులుండే అవకాశముంది.’అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో రాజ స్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న గౌహతి వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడనుంది. ఇక అశ్విన్ ఐపీఎల్‌లో 221 మ్యాచ్‌లాడి 833 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 187 వికెట్లు పడగొట్టాడు.
అశ్విన్ రాజస్థాన్ ఎలెవెన్ జట్టు: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మైర్, ధ్రువ్ జురేల్, శుభమ్ దూబే, డొనొవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయి, సందీప్ శర్మ


