Queensland Police On England Players: ఇంగ్లండ్‌ చెత్త ఆట..  క్వీన్స్‌లాండ్‌ పోలీస్‌ విచారణ

QueensLand Police Troll After Englnad Collapse 147 Runs 1st Test Ashes - Sakshi

QueensLand Police Troll After Englnad Collapse For 147 Runs 1st Test Ashes.. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ చెత్త ఆటను ప్రదర్శించింది. ఆరంభం నుంచి ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడూ మిగతా ఆసీస్‌ పేస్‌ బౌలర్ల దాటికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే ఆలౌట్‌ అయింది.

చదవండి: Ashes Series: డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్‌ అదుర్స్‌.. 127 ఏళ్ల తర్వాత

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఆటతీరుపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వైరల్‌ అయ్యాయి. ఇందులో భాగంగానే క్వీన్స్‌లాండ్‌ పోలీస్‌ విభాగం..  ఇంగ్లండ్‌ కుప్పకూలడంపై తమదైన శైలిలో క్రికెటర్ల పేర్లను ఉపయోగిస్తూ పోలీస్‌ భాషలో ట్వీట్‌ చేశారు. ఐదు వికెట్లు తీసిన కమిన్స్‌తో పాటు కామెరాన్‌ గ్రీన్‌, నాథన్‌ లియోన్‌, వార్నర్‌ పేర్లు వచ్చేలా ఆ ట్వీట్‌ ఉండడం ఆసక్తి కలిగించిందది. 

''బీఎన్‌ఈ ట్రాఫిక్‌ అప్‌డేట్‌: ఎ లార్జ్‌ క్రౌడ్‌ ఫర్‌ ది ఫస్ట్‌ టెస్ట్‌ సో ప్లాన్‌ యువర్‌ ''కమిన్స్‌'' అండ్‌ గోయింగ్స్‌. వీ వుడ్‌ బీ ''లియోన్‌'' ఇఫ్‌ వి సెడ్‌ దేర్‌ విల్‌ బి నథింగ్‌ బట్‌ ''గ్రీన్‌'' లైట్స్‌ నియర్‌ ది గాబా. డోంట్‌ సే వి డిడింట్‌ ''వార్నర్‌''.. అంటూ ట్వీట్‌ చేసింది. ఇక మరొక ట్వీట్‌లో.. '' గాబా టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలడంపై విచారణ ప్రారంభించాలనుకుంటున్నాం'' అంటూ పేర్కొంది. ఇక వెలుతురులేమి కారణంగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత తొలి రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 

చదవండి: Mitchell Starc: 85 ఏళ్ల రికార్డును తిరగరాసిన మిచెల్‌ స్టార్క్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top