
ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 404 పరుగులకు ఆలౌటైంది. 278 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా అదనంగా మరో 126 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో ఛతేశ్వర్ పుజారా(90), శ్రేయస్ అయ్యర్(86), అశ్విన్(58) పరుగులతో రాణించారు.
ఆఖరిలో కుల్దీప్ యాదవ్(40) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(22), శుబ్‌మాన్ గిల్(20), విరాట్ కోహ్లి(1) తీవ్ర నిరాశపరిచారు.
ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, ఖలీల్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు.
చదవండి: ILT20 23: కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక నిర్ణయం..! అబుదాబి కెప్టెన్‌గా సునీల్ నరైన్