PSL 2022: Shahid Afridi Reacts to Shaheen Afridi Last Over Heroics Against Zalmi - Sakshi
Sakshi News home page

PSL 2022: షాహీన్ అఫ్రిది పై ప్రశంసలు కురిపించిన షాహిద్ అఫ్రిది

Feb 22 2022 4:08 PM | Updated on Feb 22 2022 5:30 PM

PSL: Shaheen Afridi Smashes 23 Runs in Final Over, Shahid Afridi Reacts - Sakshi

పీఎస్ఎల్ 2022లో భాగంగా పెషావర్ జల్మీతో జ‌రిగిన మ్యాచ్‌లో  లాహోర్ ఖలంద‌ర్స్ ఆట‌గాడు, పాక్ స్టార్ పేసర్‌ షాహిన్‌ అఫ్రిది ఎప్ప‌టిలా బంతితో కాకుండా బ్యాట్‌తో చెల‌రేగిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. ప్ర‌త్య‌ర్ధి నిర్ధేశించిన 159 పరుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఖలంద‌ర్స్‌కు ఆఖ‌రి ఓవర్లో విజయానికి 24 పరుగులు అవ‌స‌రం కాగా, జ‌ట్టు కెప్టెన్ షాహీన్‌ అఫ్రిది (20 బంతుల్లో 4 సిక్స‌ర్లు, 2 ఫోర్ల సాయంతో 39) బ్యాట్‌తో చెల‌రేగిపోయి 3 భారీ సిక్స‌ర్లు, బౌండ‌రీతో 23 ప‌రుగులు రాబ‌ట్టి, మ్యాచ్‌ను సూప‌ర్ ఓవ‌ర్ దాకా తీసుకెళ్లాడు. 


అయితే, సూపర్‌ ఓవర్‌లో ఖలందర్స్ నిర్ధేశించిన ఆరు పరుగుల టార్గెట్‌ను పెషావర్ జ‌ట్టు తొలి రెండు బంతుల్లోనే ఛేదించి అద్భుత విజ‌యం సాధించింది. పెషావర్ ప్లేయ‌ర్‌ షోయబ్‌ మాలిక్ వ‌రుస‌గా రెండు బౌండ‌రీలు సాధించి త‌న జ‌ట్టును గెలిపించాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో షాహీన్‌ అఫ్రిది విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌కు ముగ్దుడైన  కాబోయే మామ షాహిద్ అఫ్రిది..అల్లుడూ నువ్వు సూప‌ర‌ప్పా.. అచ్చం నాలాగే ఆడావు అంటూ మురిసిపోయాడు. ట్విట‌ర్ వేదిక‌గా అల్లుడిపై ప్రశంసలు కురిపించాడు. షాహీన్‌ అఫ్రిది.. యు బ్యూటీ అంటూ కాబోయే అల్లుడిపై ప్రేమ‌ను ఒల‌క‌బోసాడు. తన ఫోటోతో పోలి ఉన్న షాహీన్ అఫ్రిది చిత్రాన్ని కలిపి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్ర‌స్తుతం వైరలవుతోంది.


షాహిద్ అఫ్రిది త‌న జ‌మానాలో మేటి ఆల్‌రౌండ‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తూ, బంతితో మ్యాజిక్ చేయ‌డంలో దిట్ట అయిన షాహిద్ అఫ్రిది త‌న జ‌ట్టుకు ఎన్నో విజ‌యాలు అందించాడు. ముఖ్యంగా వ‌న్డేల్లో అత‌ను సాధించిన 37 బంతుల శ‌త‌కం చాలాకాలం వ‌ర‌కు ఫాస్టెస్ట్ సెంచ‌రీగా చెలామ‌ణి అయ్యింది. ఇదిలా ఉంటే, షాహిద్‌ అఫ్రిది కూతురు అక్సాతో  షాహీన్ అఫ్రిది ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జంట పెళ్లి చేసుకునే అవకాశముంది. 
చ‌ద‌వండి: మూడు సిక్సర్లతో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్‌ ఓవర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement