టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు!

Priceless Asset Fans Praises Washington Sundar Can Replace Jadeja - Sakshi

New Zealand vs India, 3rd ODI: టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌పై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత జట్టుకు దొరికిన ఆణిముత్యం అతడని, వెలకట్టలేని ఆస్తి అంటూ టీమిండియా అభిమానులు వాషీని కొనియాడుతున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ ఆడగల 23 ఏళ్ల సుందర్‌.. భవిష్యత్తులో మేటి ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడంటూ కితాబులిస్తున్నారు.

వాళ్లిద్దరు మినహా అంతా విఫలం
న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా మూడో వన్డే ఆడింది. సిరీస్‌ విజేతను తేల్చే ఆఖరిదైన ఈ మ్యాచ్‌లో టాపార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ 28, శుబ్‌మన్‌ గిల్‌​ 13 పరుగులు చేయగా.. అయ్యర్‌ 49 పరుగులు సాధించాడు. ఇక రిషభ్‌ పంత్‌ మరోసారి విఫలం(10) కాగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ వైఫల్యం(6) కొనసాగింది.


వాషింగ్టన్‌ సుందర్‌

ఒత్తిడిని అధిగమించి
ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ 64 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 51 పరుగులు చేశాడు. ఒత్తిడిని అధిగమించి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ధావన్‌ సేన గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.


రవీంద్ర జడేజా

జడేజా నువ్వు రాజకీయాలు చూసుకో ఇక!
ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుత ఇన్నింగ్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆటను పట్టించుకోకుండా.. రాజకీయాలపై దృష్టి సారిస్తున్న టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడని అభిప్రాయపడుతున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తున్న ఈ 23 ఏళ్ల స్పిన్‌ ఆల్‌రౌండర్‌.. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటే మేటి ఆల్‌రౌండర్‌గా ఎదగడం ఖాయమని పేర్కొంటున్నారు.

అదే విధంగా పంత్‌ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ డౌన్‌ ఆర్డర్‌లో దంచికొట్టే సుందర్‌ ఉండగా.. రిషభ్‌తో పనేముంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒత్తిడిని అధిగమిస్తూ.. అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటగల ఈ తమిళనాడు ఆటగాడికి బీసీసీఐ ప్రోత్సాహం అందివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

విలువైన ఇన్నింగ్స్‌ ఆడుతున్న సుందర్‌
మొదటి వన్డేలోనూ వాషీ 16 బంతుల్లో 37 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే త వన్డేలతొలి ఆతిథ్య జట్టు చేతిలో ఓటమి పాలైన భారత్‌.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ సమం చేయాలని భావించగా తక్కువ స్కోరుకే పరిమితమైంది. మరోవైపు.. వరుణుడు మూడో వన్డేకు కూడా అంతరాయం కలిగించడంతో రద్దైంది. సిరీస్‌ కివీస్‌ సొంతమైంది.

2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వాషింగ్టన్‌ సుందర్‌.. ఇప్పటి వరకు 32 టీ20 ఆడి 26 వికెట్లు పడగొట్టాడు. 10 వన్డేల్లో 196 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసి.. ఇప్పటి వరకు నాలుగు టెస్టులాడిన వాషీ.. 265 పరుగులు చేయడం సహా.. 6 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్‌పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్‌ 
IND vs NZ: అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్‌ మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top