నీరజ్‌.. టోక్యోలో చరిత్ర లిఖించావ్‌: మోదీ

PM Modi, President, AP Governor Lauds Neeraj Chopra And Bajrang Punia - Sakshi

నీరజ్‌ చోప్రా, భజరంగ్‌ పూనియాలను అభినందించిన ప్రముఖులు

సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒకేరోజు రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు చివరి రోజున నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించి.. గోల్డెన్‌ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇక రెజ్లింగ్‌లో భజరంగ్‌ పూనియా కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. అరంగ్రేంట్రంలోనే భజరంగ్‌ పూని​యా కాంస్యం సాధించి.. చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో నీరజ్‌ చోప్రా, భజరంగ్‌ పూనియాకులకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

నీరజ్‌.. టోక్యోలో చరిత్ర లిఖించావ్‌: మోదీ
‘‘నీరజ్‌ చోప్రా ఈ రోజు టోక్యోలో సాధించని విజయం ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఈ రోజు టోక్యోలో చర్రిత సృష్టించావ్‌. అద్భుతమైన అభిరుచితో ఆడావు.. అసమానమైన గ్రిట్ చూపించావు. స్వర్ణం గెలిచినందుకు నీకు అభినందనలు’’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. 

నీవు సాధించిన విజయం యువతకు స్ఫూర్తి: రామ్‌నాథ్‌ కోవింద్‌
‘‘నీరజ్ చోప్రా సాధించిన అపూర్వ విజయం! మీరు మీ మొదటి ఒలింపిక్స్‌లో భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్‌ను ఇంటికి తీసుకువచ్చారు. మీ ఫీట్ మా యువతకు స్ఫూర్తినిస్తుంది. మీ విజయం పట్ల భారతదేశం ఉప్పొంగిపోతుంది! మీకు హృదయపూర్వక అభినందనలు’’ అంటూ రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్‌ చేశారు. 

నీరజ్‌ చోప్రాకు భారీ నజరానా ప్రకటించిన హరియాణా ప్రభుత్వం
చండిగఢ్‌: 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. హరియాణాకు చెందిన అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో హరియాణా సర్కార్‌ నీరజ్‌ చోప్రాకు భారీ నజరానా ప్రకటించింది. అతడికి 6 కోట్ల రూపాయల నగదు బహుమానంతోపాటు.. క్లాస్‌-1 గ్రేడ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top