Tokyo olympics: గుండెలు ఉప్పొంగుతున్నాయి.. గుర్తుండిపోయే జ్ఞాపకం!

Tokyo olympics 2020: Indian Men Hockey Won Bronze Wishes Pour In - Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో గెలుపొందిన భారత పురుషుల హాకీ జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్‌ పతకంతో తిరిగి వస్తున్నందుకు భారతీయుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. సోషల్‌ మీడియా ద్వారా పలువురు ఈ విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెల్‌డన్‌ బాయ్స్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సరికొత్త చరిత్రకు నాంది: భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ భారత పురుషుల హాకీ జట్టును అభినందించారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్‌ పతకం గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన నైపుణ్యం, ప్రతిభాపాటవాలు, అంకితభావంతో ఈ గెలుపు సాధ్యమైందని కొనియాడారు. గురువారం నాటి చారిత్రాత్మక విజయం భారత హాకీ చరిత్రలో మరో సరికొత్త యుగానికి నాంది అని, క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకునే విధంగా స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ప్రతి భారతీయుడి మనసులో గుర్తుండే జ్ఞాపకం
‘‘చరిత్రాత్మకం! ప్రతీ భారతీయుడి మనసులో ఈ జ్ఞాపకం ఎల్లప్పుడూ నిలిచి పోతుంది. కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగి వస్తున్న భారత పురుషుల హాకీ జట్టుకు శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేవారు. ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చారు. హాకీ జట్టు మనకు గర్వకారణం’’ ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా మన్‌ప్రీత్‌ సేనను కొనియాడారు.

ఇక కామ్‌గా ఎలా ఉండగలం
‘‘భారత్‌కు శుభాకాంక్షలు. అబ్బాయిలు.. మీరు సాధించేశారు! ఇక మేం నిశ్శబ్దంగా ఎలా ఉండగలం. ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ.. ఒలింపిక్‌ చరిత్రలో మరోసారి భారత విజయాన్ని మరోసారి లిఖించింది పురుషుల హాకీ జట్టు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top