Paralympics: భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు | Paris Paralympics, Day 4: Nishad claims silver in high jump, Preethi gets bronze | Sakshi
Sakshi News home page

Paralympics: అదరగొడుతున్న అథ్లెట్లు.. భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు

Sep 2 2024 7:46 AM | Updated on Sep 2 2024 9:53 AM

Paris Paralympics, Day 4: Nishad claims silver in high jump, Preethi gets bronze

ప్యారిస్ వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు అద‌ర‌గొడుతున్నారు. ఈ క్రీడల్లో నాలుగో రోజు కూడా మనోళ్ల జోరు కొనసాగింది. భార‌త్ ఖాతాలో మ‌రో రెండు ప‌త‌కాలు వ‌చ్చి చేరాయి. 

పురుషుల హైజంప్ టీ46 ఈవెంట్‌లో నిషాద్ కుమార్ ర‌జ‌త ప‌త‌కం సాధించ‌గా..  మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ35 విభాగంలో ప్రీతీ పాల్ కాంస్యంతో మెరిసింది. కాగా ప్రీతీ 100 మీ. టీ35 పరుగు పందెంలో కూడా బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది. ఇక ఇప్పటివరకు పారిస్ పారాలింపిక్స్‌లో భార‌త్ గెలిచిన ప‌త‌కాల సంఖ్య 7కు చేరింది.

అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌-1 షూటింగ్‌ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించగా.. ఇదే ఈవెంట్‌లో  మోనా అగర్వాల్‌ కాంస్యం గెలుచుకుంది. 

పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్‌1లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు. అదే విధంగా మ‌హిళ‌ల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య ప‌త‌కం సాధించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement