Rishabh Pant: టెస్టుల్లో పంత్‌ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..!

Pant became the second Indian wicketkeepr to score a century and a fifty in the same Test - Sakshi

టెస్టు క్రికెట్‌లో రిషబ్‌ పంత్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో సెంచరీతో చెలరేగిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో మెరిశాడు. తద్వారా ఒకే టెస్టులో సెంచరీ, అర్ద సెంచరీ సాధించిన రెండో భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు సాధించాడు.

ఇక అంతకుముందు 1973లో భారత మాజీ వికెట్‌ కీపర్‌ ఫరోఖ్ ఇంజనీర్ ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా సెంచరీ, హాప్‌ సెంచరీ సాధించాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు. అదే విధంగా ఒకే టెస్టులో అ‍త్యధిక పరుగులు చేసిన మూడో భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌(203) నిలిచాడు. 230 పరుగులతో బుద్ధి కుందరన్ తొలి స్ధానంలో ఉండగా, ఎంస్ ధోని 224 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
చదవండిVirat Kohli Vs Jonny Bairstow: కావాలని రెచ్చగొడితే ఇదిగో ఇలాగే ఉంటది మరి?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top