అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్తాన్ స్టార్‌ ఆటగాడు

Pakistans Azhar Ali announces retirement from Test cricket - Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ అజహర్‌ అలీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్నిరకాల ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న అజర్‌ ఆలీ తాజాగా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చేప్పేశాడు. శుక్రవారం విలేకురుల సమావేశంలో అజర్ ఆలీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కరాచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టెస్టు అనంతరం టెస్టుల నుంచి ఆలీ తప్పుకోనున్నాడు. 2010లో టెస్టుల్లో  అంతర్జాతీయ  ఆలీ ఆరంగ్రేటం చేశాడు.

12 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు పాకిస్తాన్‌ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆలీ.. 95 టెస్టుల్లో 42.60 సగటుతో 7030 పరుగులు చేశాడు.  2016లో వెస్టిండీస్‌పై పింక్ బాల్ టెస్టులో ఆలీ అద్భుతమైన ట్రిపుల్‌ సెంచరీ సాదించాడు. అదే విధంగా పాకిస్తాన్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో టాప్‌ రన్‌ స్కోరర్‌ జాబితాలో అజహర్‌ ఆలీ ఐదో స్థానంలో ఉన్నాడు.

"నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. పాకిస్తాన్‌ క్రికెట్‌తో నా 12 ఏళ్ల బంధానికి ముగింపు పలకాల్సి రావడం చాలా బాధగా ఉంది. నేను బాగా ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాడు. నీను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, నా కుటంబ సభ్యలకు, పాకిస్తాన్‌ క్రికెట్‌కు అభినందనలు తెలియజేయాలి అనుకుంటున్నాను" ఆలీ పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: టీమిండియా అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. కెప్టెన్‌ వచ్చేస్తున్నాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top