ఆసిఫ్‌.. ఇంత కోపం పనికిరాదు

Pakistan batsman Asif Ali In Trouble After Hitting Keemo Paul With Bat - Sakshi

జమైకా : కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో(సీపీఎల్‌ 2020) బుధవారం జమైకా తలైవాస్‌, గుయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జమైకా జట్టు తరపున బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ 3 పరుగులకే ఔటయ్యాడు. కరీబియన్‌ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆసిఫ్ అలీ.. ఈ మ్యాచ్‌లోనూ బారీషాట్‌ ఆడబోయి డీప్ మిడ్-వికెట్ రీజియన్‌లో క్రిస్ గ్రీన్ అద్భుత డ్రైవ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే అప్పటికే పరుగు కోసం సగం క్రీజులోకి పరిగెత్తుకొచ్చిన ఆసిఫ్ అలీని ఉద్ధేశించి ఆసిఫ్‌..'నువ్వు ఔట్ అయ్యావు.. క్రీజు వదిలి వెళ్లు..' అంటూ కీమో పాల్‌ సైగ చేశాడు.

అప్పటికే ఔట్ అయ్యాననే కోపంలో ఉన్న ఆసిఫ్‌ కీమో పాల్ వైపు బ్యాట్ ఎత్తాడు. అయితే ఆసిఫ్ బ్యాట్ నుంచి తృటిలో తప్పించుకున్న కీమో.. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే కీమో పాల్‌ కోపంతో ఆసిఫ్‌ వైపు తిరిగినా అప్పటికే అతను వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో జమైకా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఆసిఫ్ అలీకి చేసిన పనికి మాత్రం క్రమశిక్షణ చర్యల కింద జరిమానాతో విధించే అవకాశం ఉంది.

చదవండి :
కోహ్లి, రోహిత్‌ల ఆధిపత్యం
మ్యాచ్‌లోనూ మాస్క్‌.. కీమో పాల్‌ వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top