
క్రికెట్ మైదానంలో ఒక్కో ఆటగాడికి ఒక్కోలా ప్రవర్తిసాడు. ఇతరుల కంటే భిన్నంగా ప్రవర్తించి అభిమానులను ఆకట్టుకుంటారు. ముఖ్యంగా వెస్టిండిస్ బౌలర్లు మైదానంతో తమదైన శైలీని ప్రదర్శించి మీడియాను ఆకర్షిస్తారు. వికెట్లు తీసిన తర్వాత మైదానంలో వారు జరుపుకునే సంబరాలు అభిమానులను ఆకట్టుకుంటాయి. షెల్డన్ కాట్రెల్ మార్చ్ సెల్యూట్ మొదలు.. కేస్రిక్ విలియమ్స్ నోట్‌బుక్ టిక్ వరకు ఒక్కొక్కొరు ఒక్కో స్టైల్లో సంబరాలు జరుపుకుంటారు. ఇప్పుడు వారి సరనన కీమో పాల్ కూడా చేరాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)మొదటి మ్యాచ్‌లో వికెట్ తీసిన అనంతరం పాల్ ప్రదర్శించిన తీరు అందరిని ఆకట్టుకుంది. వికెట్ తీసిన ఆనందంలోనూ కోవిడ్ నిబంధనలు పాటించి క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్ల మనసును దోచుకున్నాడు.
అసలు ఏం జరిగిదంటే..
క్రికెట్లో బౌలర్ వికెట్ తీయగానే ఫీల్డర్లు అతణ్ని చుట్టుముట్టి కరచాలనం చేస్తారు. ఒక్కోసారి బౌలర్‌ను ఎత్తుకొని చిందులేస్తారు. ఇవన్ని ఒకప్పుడు సర్వసాధారణం కానీ ఇప్పుడు కాదు. ఇది కరోనా కాలం. ఈ సమయంలో మనుషుల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. సామాజిక దూరం పాటిస్తే తన ఆరోగ్యంతో పాటు ఇతరులు ఆరోగ్యం కూడా కాపాడినవాళ్లం అవుతాం. సరిగ్గా ఇదే పని చేశాడు వెస్టిండిస్ ఆటగాడు కిమో పాల్.
బుధవారం సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ మరియు గయానా అమెజాన్ వారియర్స్ మధ్య తొలి సీపీఎల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. గయానా జట్టు తరుపున బౌలింగ్ చేసిన కీమో పాల్.. ఏడో ఓవర్లో కీలక వికెట్ తీశాడు. ఈ సందర్భంగా తోటి ఆటగాళ్లు పాల్‌ను అభినందించేందుకు వచ్చారు. అయితే వారిని దగ్గరకు రావద్దని సైగలు చేస్తూ మాస్క్ ధరించిన దూరంగా వెళ్లాడు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రకంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన యొక్క వీడియోను సీసీఎల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది, అక్కడ అభిమానులు సురక్షితంగా ఉండమని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. (చదవండి : ధోని కంటతడి పెట్టాడు!)
కాగా, బుధవారం జరిగిన సీపీఎల్ తొలి మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ బోణీ కొట్టింది. సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెయాడ్ ఎమ్రిట్ నేతృత్వంలోని గయానా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. విండీస్ స్టార్ ఆటగాళ్లు షిమ్రాన్ హెట్‌మైర్ హాఫ్ సెంచరీ (71; 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాది.. కీమో పాల్ నాలుగు వికెట్లు తీసి గయానా విజయంలో కీలక పాత్ర పోషించారు.
MASK ON! Keemo knows the drill! #StaySafe #CPL20 pic.twitter.com/pkABEf472p
— CPL T20 (@CPL) August 19, 2020