CPL 2021: గేల్‌ డకౌట్‌.. కానీ టైటిల్‌ మాత్రం అతని జట్టుదే

Chris Gayle Duck But St Kitts Nevis Patriots Win Maiden CPL 2021 Title - Sakshi

St Kitts and Nevis Patriots CPL 2021 Champions.. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌ 2021)లో కొత్త చాంపియన్‌గా సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌ అవతరించింది. సెంట్‌ లూసియా, సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌ మధ్య బుధవారం ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం అందుకున్న సెంట్‌ కిట్స్‌ తొలిసారి సీపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. టోర్నీ ఆధ్యంతం నిలకడగా రాణించిన సెంట్‌ కిట్స్‌ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. క్రిస్‌ గేల్‌ డకౌట్‌ అయినప్పటికి.. భీకరఫామ్‌లో ఉ‍న్న ఎవిన్‌ లూయిస్‌ 6 పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. వికెట్‌ కీపర్‌ జోషువా డిసిల్వా రాణించగా.. చివర్లో డొమినిక్‌ డ్రేక్స్‌ మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచి తన జట్టుకు తొలిసారి టైటిల్‌ను అందించాడు.

చదవండి: CPL 2021: వికెట్‌ తీశానన్న ఆనందం.. బౌలర్‌ వింత ప్రవర్తన


మ్యాచ్‌ విన్నర్‌ డొమినిక్‌ డ్రేక్స్‌

ఇక మ్యాచ్‌ విషయాని​కి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన సెంట్‌ లూసియా కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ కార్న్‌వాల్‌ 43, రోస్టన్‌ చేజ్‌ 43 రాణించారు. సెంట్‌ కిట్స్‌ బౌలర్లలో ఫాబియెన్‌ అలెన్‌ , నసీమ్‌ షా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్‌ కిట్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. గేల్‌ డకౌట్‌గా వెనుదిరగ్గా.. కాసేపటికే ఎవిన్‌ లూయిస్‌ ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత జోషుహ డిసిల్వా(37), షెర్ఫెన్‌ రూథర్‌ఫోర్డ్‌(25)లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విజయం దిశగా సాగిపోతున్న సమయంలో సెంట్‌ కిట్స్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది.

చదవండి: Chris Gayle: గేల్‌ బ్యాటింగ్‌.. బ్యాట్‌ రెండు ముక్కలు; వీడియో వైరల్‌

ఈ దశలో డొమినిక్‌ డ్రేక్‌ అద్భుతం చేశాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో విజృంభించిన అతను చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. అతనికి ఫాబియెన్‌ అలెన్‌(20 పరుగులు) నుంచి చక్కని సహకారం లభించింది. ఫైనల్‌ హీరోగా నిలిచిన డొమినిక్‌ డ్రేక్స్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. రోస్టన్‌ చేజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును గెలుచుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top