PAK Vs AUS: టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్‌: ఐసీసీ

Pakistan-Australia 1st Test ICC Rated Rawalpindi Picth Below Average - Sakshi

రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. జీవం లేని పిచ్‌ను తయారు చేశారంటూ మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అంతా విమర్శించారు. నాసిరకం పిచ్‌ను తయారు చేసి టెస్టు క్రికెట్‌కున్న గొప్పతనాన్ని నాశనం చేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోశారు.

తాజాగా రావల్పిండి పిచ్‌పై ఐసీసీ స్పందించింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే రావల్పిండి పిచ్‌ అత్యంత చెత్త పిచ్ అని.. కనీస ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో నాసిరకమైన పిచ్‌ను తయారు చేశారంటూ మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మదుగలే పేర్కొన్నారు. ''ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ మధ్య తొలి టెస్టుకు ఉపయోగించిన రావల్పిండి పిచ్‌లో తొలి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఎలాంటి మార్పు కనిపించలేదు. అటు స్పిన్నర్లకు.. ఇటు పేసర్లకు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. బ్యాటర్స్‌ పండగ చేసుకున్న ఈ పిచ్‌ కనీస ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో తయారు చేశారు. నిజం చెప్పాలంటే టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్‌ అని చెప్పవచ్చు. అసలు బంతికి ఏ మాత్రం సహకారం అందలేదు. రెండు రోజులంటే పరవాలేదు.. ఐదు రోజులు ఒక పిచ్‌పై ఎలాంటి మార్పులు లేకపోవడమనేది ఆశ్చర్యం కలిగించింది. అందుకే రావల్పిండి పిచ్‌కు అత్యంత సాధారణ పిచ్‌గా రేటింగ్‌ ఇచ్చాం.'' అంటూ చెప్పుకొచ్చారు.


ఐసీసీ రిఫరీ రంజన్‌ మదుగులే

కాగా రిఫరీ రంజన్‌ మదుగలే వ్యాఖ్యలను సమర్థించిన ఐసీసీ నాసిరకం పిచ్‌ తయారు చేసినందుకు ఒక డీ మెరిట్‌ పాయింట్‌ను ఫెనాల్టీగా విధించింది. ఇక పాక్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు ఫేలవ డ్రాగా ముగిసింది. ఐదు రోజుల మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ పండగ చేసుకున్నారు. ఇరు జట్లు కలిపి 1187 పరుగులు చేయగా.. కేవలం 14 వికెట్లు మాత్రమే నేలకూలాయి. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు కరాచీ వేదికగా మార్చి 12 నుంచి జరగనుంది.

చదవండి: Sakshi Singh Dhoni: క్రికెటర్ల భార్యలైతే స్వేచ్ఛ ఉండకూడదా?.. ధోని భార్య సాక్షి

IND Vs SL: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top