స్వర్ణం నెగ్గిన నీరజ్‌ చోప్రా | Olympic Champion Javelin Thrower Neeraj Chopra Wins Gold Kuortane Games | Sakshi
Sakshi News home page

Neeraj Chopra: స్వర్ణం నెగ్గిన నీరజ్‌ చోప్రా

Jun 19 2022 7:42 AM | Updated on Jun 19 2022 7:44 AM

Olympic Champion Javelin Thrower Neeraj Chopra Wins Gold Kuortane Games - Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈ ఏడాది తొలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్‌లాండ్‌లో శనివారం జరిగిన కూర్తానె గేమ్స్‌లో నీరజ్‌ జావెలిన్‌ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. కెషర్న్‌ వాల్కట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో; 86.64 మీటర్లు) రజతం, అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా; 84.75 మీటర్లు) కాంస్యం సాధించారు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్‌ పది నెలల తర్వాత ఇటీవల పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొని రజతం సాధించాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement