తినడం మొదలుపెడితే ఒక్కటి కూడా మార్కెట్‌కు‌ వెళ్లదు

MS Dhoni Shared Hillarious Video About Tasting Of Fresh Strawberry - Sakshi

రాంచీ: ఎంఎస్‌ ధోని ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత రైతుగా మారిన సంగతి తెలిసిందే. రాంచీలోని తన వ్యవసాయక్షేత్రంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ బిజీగా మారిపోయాడు. తాజాగా శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన తోటలో పండిన స్ట్రాబెరీని రుచి చూస్తూ  వీడియోనూ షేర్‌ చేశాడు. కాగా ఆ వీడియోకు ధోని పెట్టిన క్యాప్షన్‌ వైరల్‌ అవుతుంది.(చదవండి: ఆసీస్‌ క్రికెటర్‌పై షేన్‌ వార్న్‌ అసభ్యకర వ్యాఖ్యలు)

ఇంతకీ ధోని పెట్టిన క్యాప్షన్‌ ఏంటంటే.. ' నా పొలంలోని స్ట్రాబెరీలను నేను తినడం మొదలుపెడితే మార్కెట్‌కు ఒక్క పండు కూడా వెళ్లేలా లేదు' అంటూ సెటైరిక్ పద్దతిలో కామెంట్‌ చేశాడు. తన తోటలో పండిన స్రాబెరీ చాలా రుచిగా ఉన్నాయని.. తనకు బాగా నచ్చడంతో  అన్ని తానే తినేస్తానేమోనని ఉద్దేశంతో క్యాప్షన్‌ పెట్టినట్లుగా తెలుస్తుంది.ధోని షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.(చదవండి: ఆసీస్‌పై రోహిత్‌ సెంచరీ సిక్సర్ల రికార్డు)

రాంచీ శివార్లలోని శంబో గ్రామంలోని తన 43 ఎకరాల ఫామ్‌ హౌస్‌లో ధోనీ 10 ఎకరాల్లో టమోటా, క్యాబేజీ, బొప్పాయి, ఇతర పంటలను పండిస్తున్నాడు. ధోనీ ఫామ్‌ కూరగాయలకు స్థానికంగా మంచి డిమాండ్‌ రావడంతో వీటిని గల్ఫ్‌లో మార్కెట్‌ చేసేందుకు ఫామ్‌ ఫ్రెష్‌ ఏజెన్సీతో జార్ఖండ్‌ వ్యవసాయ శాఖ సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.ఇక గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని.. ఐపీఎల్ 2020 సీజన్ మాత్రం ఆడాడు. కానీ మునపటి సత్తా చాట లేకపోయాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top